రైల్వే బడ్జెట్ 2014-15 హైలైట్స్
posted on Jul 8, 2014 @ 2:40PM
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ లోక్ సభలో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైల్వే ప్రయాణికుల భద్రతే తమ ప్రధానాంశమని కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. సరుకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే లక్ష్యమన్నారు. సరుకు రవాణాలో చైనా, రష్యా లాంటి దేశాల తర్వాత తామే ఉన్నామని చెప్పారు. ఈ ఏడాది రూ. 602 కోట్లు మిగుల ఆదాయమే తమ లక్ష్యమని ప్రకటించారు.
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం.
2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం.
3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్.
5. చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు.
6. కొత్తగా అయిదు జన సాధారణ్ రైళ్లు.
7. విజయవాడ-ఢిల్లీ మధ్య ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు.
8. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు.
9. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.
10.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.
11. 676 రైల్వే ప్రాజెక్టులు ఆమోదిస్తే 356 మాత్రమే పూర్తి.
12.11,794 కోట్ల లోన్ కోసం ప్రయత్నం.
13. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం.
14. రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది.
15. హైస్పీడ్ నెట్వర్క్ను నెలకొల్పుతాం.
16. గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి.
17. 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
18. ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం.
19. ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం.
20. 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం.
21. 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి.
22. పదేళ్లలో 99 కొత్త లైన్లకు రూ. 60 వేల కోట్లు ఖర్చు.
23.ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బులెట్ ట్రయిన్.
24. నిమిషానికి 7200 టికెట్లు ఇచ్చేలా ఈ టికెటింగ్ వ్యవస్థ తీర్చిదిద్దుతాం.
25. 4వేల మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం.
26. ఎంపిక చేసిన 9 మార్గాల్లో రైళ్ల స్పీడ్ 160 కిలోమీటర్లు నుంచి 200 కిలోమీటర్లుకు పెంచుతాం.
27. త్వరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు.
28. ఈశాన్య రాష్ట్రాలకు ఏకో టూరిజం రైళ్లు, ఎడ్యుకేషన్ రైళ్లు.
29. ఈ ఏడాది 602 కోట్ల మిగులు ఆదాయం లక్ష్యం.
30. రైల్వేకు కేంద్రం రూ.1100 కోట్లు సాయం.
31. విద్యార్థులకు ప్రత్యే రాయితీలు.
32. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు.
33.ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు.
34. టికెట్ల అమ్మకం ద్వారా రూ. 44,645 కోట్లు ఆదాయం.
35. చార్థామ్, కేదారనాథ్,బద్రీనాథ్లకు రైల్వే కనెక్టివిటీ.