Read more!

ఏపీలో భానుడి భుగభగలు

ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా శక్రవారం (ఏప్రిల్ 26) రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 174 మండలాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  ఇక రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25)నంద్యాలలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అలాగే విజయనగరం జిల్లా రాజాంలో 45.5, అల్లూరి జిల్లా కొండై గూడెంలో 45.1, కడన జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రంలో హీట్ వేవ్ కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.