సంపూర్ణ ఆరోగ్యానికి సమగ్ర ఆహారం
posted on Aug 20, 2021 @ 9:30AM
వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార నియమాలు...
పిండి పదార్ధాలు...
మనం తీసుకునే ఆహారంలో తవుడు,తీయని బియ్యము,లేదా ముడి బియ్యము అన్నం తినండి.గోధుమలు మీరే పిండి పట్టించ్జి,జల్లెడ పట్టని గోధుమ పిండితో నొనె లేకుండా పుల్కాలు,రోటీలు చపాతీలు,రోటీలు చేసుకుని తీసుకోండి.
బహు ధాన్యాల పిండి...
గోధుమలు మూడుకిలో గ్రాములు రాగుల పచ్చజోన్నలు,అరకిలో గ్రాము రాగులు,అరకిలోగ్రాము సజ్జలు,అరకిలో గ్రాము పిండిని జల్లించకుండా పుల్కాలు రోటీ, చపాతీలు చేసుకోవచ్చు.ఒక్కో భోజనంలో ఒక్కో రకం వాడవచ్చు.
కాయాగూరలు,ఆకు కూరలు...
ప్రతి రోజూ భోజనంలో ఒక ఆకు కూర,ఒక కాయ కూర.ఉంటె మంచిది.మీకు ఆకుకూరలో పప్పులేకుండా ఉంటె ఇంకా మంచిది.
మాంసకృత్తులు...
జంతు సంబంధ మామ్సక్రుతులకు బదులు శాకాహారులుపప్పులను గింజలను వాడతారు. కందిపప్పు, పెసరపప్పు, శనగ పప్పు, ఉలవపప్పు, బటాణి పప్పు, కేసరి పప్పు,సోయపప్పు. వీటిని జీర్నిన్చుకోడం కష్టం.ఎందుకంటే వీటిని తీసుకోవడం వాళ్ళ గ్యాస్ అసిడిటీ,కడుపు ఉబ్బరం,మల బద్ధకం, హేమరాయిడ్స్,అంటే పైల్స్,లాంటి సమస్యలు వస్తాయి. పైల్స్ తో బాధపడే వారికి ఈరకమైన ఆహారం పనికి రాదు. పరిస్తితీవ్రతరం చేస్తాయి.రోగి ప్శ్రిస్తితిని బట్టి పప్పుల వాడకం.తగ్గించమని లేదా పూర్తిగా వదిలి వేయమని చెప్పవచ్చు.
ఊరగాయపచ్చళ్ళు...
తెలుగు రాష్ట్ర్రాలలో ఊరగాయలేనిదే ముద్దదిగదు.కోస్తాజిల్లలలో,క్రిష్ణజిల్లలలో వీటి వాడకం ఎక్కువే.
వీటిలో వాడే కారం కన్నా అధిక మోతాదులో వాడే ఉప్పు,నూనె ఆరోగ్యాంకి హానికర పదార్ధాలు. వీటిలో ఎండుమిరపకాయాలు.కారంలో చాలా శక్తి వంతమైన ఔషాద గుణాలు ఉన్నాయి. మిరపకాయల ఖారం లో మనం కలిపే ఉప్పు నూనె తదితరమసాలాలు దినుసులు దానిలోని ఔషద గుణాలను తటస్థం చేయడమే కాక మనగుండే రక్తనాళాల వ్యవస్థను కీళ్ళకు హానికలిగిస్తాయి. ఊరగాయ పచ్చళ్ళను ఎంతత క్కువగా వాడితే అంతమంచిది.
ఆహారం ఎన్నిసార్లు తినాలి...
ఇప్పుడు ప్రపంచం అంతటా ఆహారాన్ని ప్రతిరోజూ మూడు సార్లు తీసుజున్తున్నారు.ఆహారాన్ని మూడుసార్లె తీసుకోవాలాని ప్రతిరోజూ మూడుసార్లె తీసుకోవాలని అంతకంటే ఎక్కువతీసుకోకూడదని
అలాతీసుకుంటే జీర్ణ వ్యవస్థ మీద దాని అనుబంద గ్రంధుల మీద భారం ఎక్కువపడుతుంది. ఇంసూలిన్ అవసరం లేని మధుమేహ వ్యాదిపెషంట్లు ప్యాన్క్రియాస్ లోని బీటా కణాలు ఇంసూలిన్ ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయలేక పోయినా కొంచం తక్కువ స్థాయిలో ఉత్పత్తిచేస్తూనే ఉంటాయి. ప్రతిసారీ ఆహారం ఎక్కువస్తాయిలో తీసుకున్న వెంటనే రక్తంలోకి అధిక స్థాయిలో వచ్చి చేరే గ్లూకోజ్ నంతటినీ జీవకణాల్ లోకి చేరవేయడానికి అవసరమైనంత ఇన్సూలిన్ డిపెండెంట్ డయాబెటిక్ పేషంట్లు బీతాకనాలు తయారు చేయలేవు.అయితే టైప్ 2 డయాబెటిస్ పేషంట్లు రీఫైండ్ పిండిపదార్ధాలు వదిలేసి,తవుడు తెల్లని బియ్యము,జల్లెడ పట్టని గోధుమ పిండి. జల్లెడ పట్టని తృణ ధాన్యాల పిండి లాంటి వాటిని రోజూ మూడు సార్లుగా తినే ఆహార పరిమాణాన్ని అయిదు భాగాలు చేసి
అయిదు సార్లుగా తింటే రక్తంలోకి గ్లూకోజ్ ను పాక్షికంగా పనిచేసే బీటా కణాలు కూడా తేలికగా జీవకణాల లోకి చేరగలవు అంటే టైప్ 2 డయాబెటీస్ పేషంట్లు మూడు సార్లుగా తినే ఆహారాన్ని అయిదు సార్లుగా తింటే రక్తంలోకి గ్లూకోజ్ ను అద్య్పులో ఉంచడం సాధ్యమౌతుంది.
పండ్లరసాలు...
పండ్ల రసాలు ఉదయము,మధ్యాహ్నము,రాత్రికూడా భోజనానికి ముందు ఒక చిన్న గ్లాసుదు పండ్లరసం
తాగడం మంచిది.
పండ్లు...
ఉదయం భోజనానికి మాధ్యాహ్నం భోజనానికి మధ్య మధ్యాహ్న భోజనానికి రాత్రిభోజనానికి మధ్య ఒక పండు తినడం మంచిది.అయితే రోజూ ఒకే రకమైన పండు తినడం మంచిదికాదు.ఒక్కో రకం పండ్లలో ఒక్కోపోశాకాలు ఉంటాయి.ఎన్నిరకాల పోషకాలు తింటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందుతాయి.
ఎండిన పండ్లు,పప్పులు...
వీటిలో ఖనిజాలు మాంసకృత్తులు,తీపి పదార్ధాలు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతిరోజూ వీటిని ఒక యాభై గ్రాములు తీసుజుంటే మన జీర్ణ శక్తికి,జీవ ప్రక్రియకు ,గ్రంధులు సమర్దవంతం గా పని చేయడానికి ఉపయోగ పడతాయి.
గింజలు మొలకలు...
గింజలలో కన్నా మొలకలోచ్చిన గింజలలో మనకు ఉపయోగపడే పోషకాలు అనేకరెట్లు ఉంటాయి.అవి మనకు తేలికగా జీర్ణం అవుతాయి మనం జీర్ణించుకున్న ఆహారం వేడిగాను శక్తిగాను మార్చడానికి ఉపయోగపడతాయి.మొలకల లోని పోషక పదార్ధాలు మనకు పూర్తిగా ఉపయోగపడాలంటే మొలక నుండి వేరు ఒకటి,లేదా ఒకటిన్నర అంగుళం పెరగాలి,ఒకటి రెండు ఆకులు బయటికి వచ్చి ఆకుపచ్చ రంగుకు తిరగాలి అప్పుడే మొలకలను తినాలి.
పెర్మెంటే డ్ ఫుడ్...
ఆంగ్లంలో ఫెర్మెంటెడ్ ఫుడ్ అని పిలవబడే ఆహార పదార్దాలాను తెలుగులో పులవపెట్టిన ఆహారంగా చెప్పవచ్చు.పెరుగు,మజ్జిగ,ఇలాంటివి వీటిలో కొన్ని రకాల సూక్ష్మజీవుల సహజ ప్రక్రియల వల్ల పోషక విలువలు పెరుగుతాయి.శరీరంలో ఈ ఆహారం తేలికగా జీర్ణం అవుతాయి.ప్రతిభోజనంలో వీటిని వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అత్యవసర కొవ్వు సంబంధిత ఆమ్లాలు...
మన ఆరోగ్య పటిష్టతకు కొవ్వు పదార్ధాలు.అవసరం.అయితే వాటిని అధిక మోతాదులో వాడడం వల్ల మనఆరోగ్యానికి హానికరం అత్యవసరకోవ్వు సంబందిత ఆమ్లాలలో ఒమేగా 3 అనేది ముఖ్యమైనది.అది మన ఆహారంలో సరిపడా ఉండడం లేదు.అది అవిసగింజలలో ఫ్లక్స్ సీడ్స్,లో పుష్కలంగా ఉంది.భోజనం కాగానే ఒక టేబుల్ స్పూన్ అవిసగింజలు నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది.
పంచదారకు బదులు నల్ల బెల్లం...
తెల్లని పంచదారలో కేవలం కేలరీలు తప్ప మరే ఇతర ప్రధాన పోషక పదార్ధాలు గాని,సూక్ష్మ పోషక పదార్ధాలు గాని లేవు.పంచదారను పంచాదారాతో చేసిన పదార్దాలాను గాని అధికంగా తినడం ఆరోగ్యానికి చాలా హానికరం.చెరకును గానుగ ఆడి చేసిన బెల్లం లో అనేక రకాల సూక్ష్మ పోషక పదార్ధాలుఉన్నాయి. ఆరోగ్యానికి బెల్లం తేనె అంత మంచిదని పరిసోదకులు చెబుతున్నారు. పంచాదారాకు బదులు నల్ల బెల్లం వాడడం మంచిది.
సముద్రపు ఉప్పు...
దీనిని సంస్కృతంలో సైన్ ధవలవణం...
సముద్రపు ఉప్పులో ఉన్న ఖనిజాల ఇతర పోషకాల విషయంలో సముద్రపు ఉప్పుకు సైందవ లవణానికి రాతి ఉప్పుకు ఎలాంటి తేడాలేదు.సముద్రపు ఉప్పు మిగతా ఉప్పుల కన్నా చవక.అయితే దానిలో కొంచం చెమ్మ కొంచం ఎక్కువగానే ఉంటంది.ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సముద్రపు ఉప్పులో 84 రకాల ఖనిజాలు ఉన్నాయి.మన రక్తస్మ్లో కూడా అఖనిజాలే అనిష్పత్తిలో ఉంటాయి అవి మన గ్రంధులకు అవసరం.మితంగా వాడినప్పుడు.సముద్రపు ఉప్పు హై బ్లడ్ ప్రేషేర్ కు దారి తీయదు. అన్ని వంటకాల లోను సముద్రపు ఉప్పు మితంగా వాడడం మంచిది.
మంచి నీళ్ళు...
గంటకు ఒక గ్లాసు నీళ్ళు తాగడం మంచిది.నీళ్ళు మనదేహంలోని వ్యర్ధ పదార్ధాలను బహిష్కరించడానికి దేహంలో జరగాల్సిన సహజ ప్రక్రియకు అవసరమైన నీటిని అందించడానికి ఉపయోగ పడుతుంది.
ఆహారంలో తినకూడని పదార్ధాలు...
తెల్లని భియ్యం,తెల్లని గోధుమ పిండి.తెల్లని మల్టీగ్రైన్ పిండి,పంచదార,అన్ని రకాల తీపి పదార్ధాలు,వేపుడు వంటకాలు,షాపుల్లో అమ్మే తినుబండారాలు, మాంసం, గుడ్లు, చేపలు, రొయ్యలు, అన్నిరకాల పప్పులు, పప్పులతో చేసిన వంటకాలు,రీఫైండ్ ఉప్పు మసాలాలు, ఊరగాయ పచ్చళ్ళు, కోఫీ, టీ, కూల్ డ్రింక్స్ మానివేయడం మంచిది.
వ్యాయామం తప్పని సరి...
ప్రతిరోజూ నడక శ్వాస, వ్యాయామము,బౌతిక వ్యయామాము,అందరికీ అవసరము ఎవయస్సులో ఉన్నవారైనా వ్యాయామం చేయవచ్చు.
రోజువారి ఆహార నియమావళి...
ఉదయం పళ్ళు తోముకో గానే -ఒక గ్లాసు సమాన భాగాలుగా క్యారట్ జ్యూస్,బీట్రూట్ జ్యూస్, మంచినీళ్ళు, ఉదయం అల్పాహారానికి,ఒక గ్లాసు పండ్ల కూరగాయాల,ఆకుకూరల రసం,జల్లెడ పట్టని చిరు చిరు తృణ ధాన్యాల పిండితో నూనె లేకుండా కాల్చిన పుల్కాలు.కయాగూరాలు లేదా ఆకు కూరలు,వేపుడు చేయని కూర ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ ఒక కప్పు మీగడ లేని పెరుగు.అల్పాహారం నికి మధ్యాహ్నా భోజనానికి మధ్య ఒకటిగాని లేదా రెండుకాని రక రకాల పండ్లు,మధ్యాహ్న భోజనానికి మధ్య రాత్రి భోజనానికి మధ్య మీ ఆకలిని బట్టి ఒకటి లేదా రెండు పండ్లు. సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్య ఒక యాభై గ్రాముల ఎందు పండ్లు,పప్పులు,రాత్రి భోజనం---ఒక గ్లాసు పండ్లరసం,మాధ్యాహ్న భోజనం కన్నా రాత్రి భోజనం తక్కువగా తేలికగా,జీర్ణ నయ్యేదిగా నూ ఉండాలి.జల్లెడ పట్టని మల్టీ గ్రైన్ పిండితో చేసిన పుల్కాలు,కాయకూర,లేక ఆకుకూర. ఒక గ్లాసు మజ్జిగ,లేక పెరుగు,నిద్రపోయే ముందు.ఒక కప్పు పాలు లేకుండా గ్రీన్ టీ లేక హెర్బల్ టీ గాఢ నిద్ర పట్టేట్లు చేస్తుంది.