వాటర్ చెస్ట్ నట్స్.. ఆరోగ్యానికి ఎంత గొప్ప ఔషదమో..!
posted on Oct 18, 2025 @ 9:30AM
సీజన్‌ను బట్టి మార్కెట్లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆ సీజన్ లో వచ్చే అనారోగ్యాలకు ఆ సీజన్ లో లభించే పండ్లే చెక్ పెడుతుంటాయి. వీటిలో ఒకటి వాటర్ చెస్ట్‌నట. ఇది శీతాకాలపు సూపర్‌ఫుడ్. ఇతర సీజన్ లలో డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తుంది. వాటర్ చెస్ట్ నట్ ఆరోగ్యానికి చాలా చక్కని ఔషదం అని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే..
వాటర్ చెస్ట్ నట్ లో పోషకాలు..
ఈ పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదంలో వాటర్ చెస్ట్ నట్స్ కు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఈ పండు రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్య ఔషధం కూడా.
పిసిఓఎస్ మహిళలకు..
PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది హార్మోన్ సమస్యల వల్ల వచ్చే సమస్య. దీనిలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమవుతాయి, అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఇది నెలసరి సరిగా రాకపోవడం, పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, , అవాంఛిత రోమాలు, మొటిమలు, బరువు పెరగడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. PCOSతో బాధపడేవారు వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, సంతానోత్పత్తికి సపోర్ట్ ఇస్తుంది.
డయాబెటిస్..
వాటర్ చెస్ట్‌నట్‌లు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది చక్కెర పెరుగుదలను నివారిస్తుంది . వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సులభం చేస్తుంది.
జీర్ణక్రియ..
వాటర్ చెస్ట్‌నట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సపోర్ట్ ఇస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట నుండి ఉపశమనం లభిస్తుంది.
ఎముకలు, జుట్టు ఆరోగ్యం..
వాటర్ చెస్ట్‌నట్‌లు ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వాటర్ చెస్ట్‌నట్‌లలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడతాయి. దంతాలు, జుట్టును కూడా బలోపేతం చేస్తాయి.
బలహీనత, అలసట..
వాటర్ చెస్ట్‌నట్‌లను తీసుకోవడం వల్ల సాధారణ బలహీనత, అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు శరీరానికి సమృద్ధిగా పోషణను అందిస్తుంది, ఎనర్జీని పెంచుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...