ఆలయ దర్సనం- ఆరోగ్య రహస్యం
posted on Jul 16, 2022 @ 9:30AM
మనం ఉదయాన్నే స్నాన పానాదులు చేసి సాంప్రదాయ బద్దంగా పంచె కట్టి ఆలయానికి వెళ్ళడం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ.
ఎందుకంటే ఆలాయాల దర్శనం ద్వారా ఆ ఆలయ వైభవం,చరిత్ర,ఆలయ సిల్పాలలో దాగిన సాంప్రదాయాలు, ఆలయ దర్స ణానికి ముందు దర్శించే ధ్వజ స్థంభం,ఆలయ గోపురాల ప్రాముఖ్యత, ఆలయం పై ఉన్న గోపురాలు వాటి చక్రాలు ఉత్తేజి త మౌతయాని.అలాగే మనం ఆలయం లో చేసే దర్సనం,ఘంటా నాదం,పొర్లు దండాలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రపంచం లో ఎక్కడా లేని సంస్కృతి సంప్రదాయాలకు భారాత దేశం లోనే కనిపిస్తాయి. ఆలయాల వెనుక ఉన్న రహాస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్య పోక తప్పదు. భారత దేశం లో ప్రజలు ప్రతి రోజూ వేకువజామున లేదా బ్రహ్మ ముహూర్తం లో ఆలయాలకు వెళ్ళడం సాధారణంగా కనిపించే దృశ్యం దీనికి గల కారణం రోజంతా మనఃపూర్వకంగా చేసే దండం,దస్కం,పొర్లు దండాలు, ప్రదక్షిణం కొబ్బరి కాయ కొట్టడం వెనుక మిమ్మల్ని సమర్పించుకునే తత్వం ఉండేందుకు ఈ పద్దతులు ప్రవేశ పెట్టారని శాస్త్రం చెపుతోంది. ఫలం పుష్పం తోయం అన్నట్లు ఎవరికీ తోచింది వారు భగవంతుడికి సమర్పిస్తారు.
ఈ ప్రక్రియ కేవలం మనకు రోజంతా పోజిటివ్ ఎనర్జీ లభిస్తుందని వైద్యులు తమ పరిశోదనలో వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ సౌత్ పోల్స్ పీడనం కారణంగా వచ్చే మ్యాగ్నటిక్ ఎలక్ట్రికల్ వేవ్స్ ఎక్కడైతే పంపిణీ జరుగుతుందో.ఆ ప్రదేశం లో పోజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యం కావడం గమనించామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం జరగడం గమనించ వచ్చు.ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఆ ప్రదేశాన్ని గర్భాగ్రుహం లేదా మూలస్తానమని అంటారు. గర్భ స్థానం లేదా మూల స్థానం మనవ శరీరం లో సోలార్ చక్రాన్ని ఉత్తేజ పరుస్తుంది.ఈ విధంగా ప్రతిగుడిలోనూ 7 శిఖర స్థానాలు ఉండడం గమనించవచ్చని పండితులు పేర్కొన్నారు.అయితే ఏడు శిఖరాలు మానవ శరీరంలో ఏడు చక్రాలను ఉత్తేజ పరుస్తాయి. భగవంతుడి విగ్రహం దేముడి ప్రతిరూపంగా భావిస్తారు.దివ్యశక్తికి బౌతిక రూపమే విగ్రహం.విగ్రహానికి మానవ శరీరానికి ఏకాగ్రతను పెంచడానికి శక్తి ని కేంద్రీకృతం చేయడానికి విగ్రహం తోడ్పడుతుంది.
ప్రదక్షిణం...
ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి గర్భగుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయడం అనే పద్ధతి ని ప్రదక్షణ చేయడం అంటారు.ప్రదక్షిణం చేయడం ద్వారా శారీరకంగా ఏకాగ్రత తతో కూడుకున్న వ్యాయామం భక్తి ప్రపత్తులతో కూడుకున్నసంకల్పం నెరవేరేందుకు ప్రదక్షిణం గా పండి తులులు చెపుతారు భగవంతునికి మనసు తనువు మనస వాచ కర్మేణా సమర్పితం అని దాని ఆర్ధం.
అయితే ఏ అలయం లో ఎలా ప్రదక్షిణ చేయాలి అన్నది ప్రశ్న...
శైవ క్షేత్రాలలోచేసే ప్రదక్షిణ మరోరకంగా ఉంటుంది శివాలయం లో చేసే ప్రదక్షిణ నందికి శివుడికి మధ్య చేయరాదని ప్రదక్షిణ మధ్యలో ప్రారంభించి చండీ శ్వరుడి వరకూ వెళ్లి మరల వెనక్కి రావాలని అందుకు కారణం ఉందని చండీశ్వరుడికి వినికిడి సమస్య ఉన్నందున చిటికే వేయడం లేదా చప్పట్లు కొట్టడం పద్దతిగా కొనసాగుతుందని ఇక విష్ణు ఆలయం లో యధాతధంగా ప్రదక్షిణలు చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. కొన్ని ఆలయాలలో ముఖ్యంగా అన్నవరం, సింహాచలం. వంటి అరుణాచల క్షేత్రాలలో కొండచుట్టూ ప్రదక్షణ చేయడం గమనించవచ్చు దీనిని గిరి ప్రదక్షిణంగా పేర్కొన్నారు.
కాగా ప్రదక్షిణం వల్ల లాభాలు ఏమిటో చూద్దాం....
ప్రదాక్షిణా లు క్లోక్ వైజ్,చేయడం వల్ల మనకు పోజిటివ్ శక్తి మానవ శరీరానికి అందిస్తుంది.శక్తి పూర్తిగా నిడుతుంది.ఈ కారణంగానే శరీరంలో చక్రాలు అన్నీ యాక్టివ్ అవుతాయి. ప్రదక్షిణ ద్వారా ఎన్నోరకాల రుగ్మతలు దూరం అవుతాయని మనం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యారస్మి లభిస్తుంది.మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది. అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ...
అలాయంలో చెప్పులు వేసుకుని ప్రదక్షిణ చేయడం అనర్ధ దాయక మని దానివల్ల ఫలితాలు ఉండబోవని విశ్లేషిస్తున్నారు. కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం వల్ల అరికాళ్ళ లో అక్యుప్రేషర్ అయి మీశారీరంలో వచ్చే మోకాళ నొప్పుల బాధ తగ్గుతాయి.భావానతో చేసే ప్రయత్నం కొంత మేర సత్ఫలితాలు ఇస్తుంది.
దేముడికి రెండు చేతులతో నమాస్కారం...
మన శక్తి మనదగ్గరే ఉంటుంది.అనే ఉద్దేశం తో మన రెండు చేతులను కలపడం వల్ల పోజిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరం లోకి ప్రవేశిస్తుంది.
సాష్టాంగ నమస్కారం...
సాష్టాంగ నమస్కారం లేదా బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల భూమికి ఉన్న మ్యాగ్నేట్ ఫీల్డ్ మన శరీరంలో నాడులకు తగులు తాయనే సాష్టాంగ నమస్కారం దేముడికి చెయ్యమని అంటారు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకరకంగా మనశరీరం లో పేరుకున్న కొవ్వు కరగాదానికి యోగ శాస్త్రం లో పేర్కొన్నారు.
పొర్లు దండాలు...
భగవంతుడిని కరుణించమంటూ కోరిన కోర్కెలు తీరాక మొక్కుబడులుగా భక్తులు రకరకాల పద్దతులు ఎంచుకుంటారు అలా పెట్టె దండాలాలో మరొకటి పొర్లు దండాలు చెయ్యమని ముఖ్యంగా స్త్రీలకు పిల్లలు పుట్టక పోవడానికి చలారకాల కారణాలు ఉండవచ్చు వాటిలో గర్భాశయం లో రక రకాల సమస్యలు ఉండ వచ్చు.అయితే వారిని బోర్లా పడుకుని పొర్లుతూ కుచ్చిళ్ళ చీర దోపుకుని దొర్లడం వల్ల గర్భాశయం లో ఉన్న గడ్డలు వాపులు వత్తుకుని కరిగి వారికి గర్భాశయ సమస్యల తగ్గుతాయి. అందుకే ఒక్కోసమస్యకు ఒక్కోపరిష్కరాం మన సాంప్రదాయం లో ఉన్నాయన్న సంగతి గమనించాలి.
ఇక అలయాలలో ఉండే గోపురాలు వాటి మూలాధార చక్రాలకు సంబంధం ఏమిటో చూద్దాం...
మొదటి గోపురం-మనశరీర అవయవానికి నికి ఉన్నసంబంధం...
మనశరీరానికి గోపురానికి ఉన్నసంబంధం చూసినప్పుడు మొదటి గోపురం మూలాధార చక్రం అంటే ఓవరి /టెస్టిస్ ను ఉత్తేగాపరుస్తుందని అలాగే కిడ్నీ/ ఓబీ ఎనేర్జీ ని పెంచుతుందని అలాగే పైకి కనిపించే చెవి చిఇనపడం లో కాస్మిక్ ఎనేర్గీ మూలాధార చక్రం నుండే వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా మొదటి గోపురం ప్రతిష్టించే సమయం లో మనవ శరీరం లో చెప్పిన అవయవాలను ఎనేర్జీ ని ప్రతిష్టిస్తారని నిపుణులు విశ్లేషించారు.
రెండవ గోపురం-మనశరీర అవయవానికిఉన్న సంబంధం...
రెండవ గోపురం స్వాదిష్టాన చరమని ఇది పైకి కనిపించే ముక్కు ఎడర్నల్ గ్లాండ్,ఊపిరి తిత్తులు,చేతి బొటనివేలు ద్వారా కాస్మిక్ ఎనేర్జీ లభిస్తుంది అని నిపుణులు పేర్కొన్నారు.
మూడవ గోపురం-మనశరీర అవయానికి ఉన్నసంబంధం...
మూడవ గోపురం మణిపూరక చక్రం గా చెపుతున్నారు ఇది పాంక్రియాస్,స్ప్లీన్ ,పొట్ట,కాళ్ళ లో ఎడమకాలు,బోటన వేలు,పెదాల కు కాస్మిక్ ఎనేర్జీ ని ఇస్తుంది. అని నిపుణులు విశ్లేషించారు.
నాల్గవ గోపురం -మన శరీర అవయవానికి ఉన్న సంబంధం --
నాల్గాగోపురం హృద్య చక్రం గా పేర్కొన్నారు. శరీరంలో థై మస్ గ్లాండ్,ఇందులో లివర్,/గాల్ బ్లాడర్,కుడి కాలు బొటన వేలు లో శక్తి ఉంటుంది.దీనికి అదనంగా కళ్ళు ఉంటాయి.
ఐదవ గోపురం -మనశరీరానికి ఉన్న సంబంధం...
ఐదవ గోపురం విషుతి చక్ర మని అంటారని ఇది శరీరం లో థైరాయిడ్ గ్రంధికి,గుండెకు చేతిలో చిటికెన వేలు అదనపు అవయవంగా నాలుక గా విశ్లేషించారు.
అరవ గోపురం మనశరీరానికి ఉన్నసంబంధం...
ఆరవ గోపురం అజ్ఞా చక్రం అని అంటారు.ఇది శరీరం లో పిట్యు టరీగ్రంధి/పినా గ్లాండ్స్,ఈ చక్రం ప్రభావితం చేస్తుంది అజ్ఞా చక్రం ద్వారా ఉన్నతమైన తెలివి తేటలు.పెంచుతాయి. శరీరం యొక్క ముందు వెనుక భాగాలలో శక్తికి ఆజ్ఞా చక్రం ద్వారా లభిస్తుంది.మధ్య వేలు ద్వారా లేదా రింగ్ ఫింగర్ ద్వారా శక్తి లభిస్తుందని దీనికి అదనపు అవయవం నాలుక గా పేర్కొన్నారు.
ఏ డవ గోపురం మనశరీర అవయవానికి ఉన్నసంబంధం...
ఏడవ గోపురాన్ని ఆలయ శిఖరం పై ఉండే కలశం గా పేర్కొన్నారు .ఇది వ్యక్తి యొక్క సహస్ర చక్రమనిఅంటారు ఇలా మానవ శరీరానికి ఆలయ గోపురాలకు శరీర చక్రాలకు వాటిలో ఉండే అవయవాల పనుతీరు వాటిద్వారా మనకు లభించే శక్తి తదితర వివరాలు ఇవి.కొన్ని సందర్భాలలో మన శరీరంలో వచ్చిన అనారోగ్య సమస్యకు శరీరం లోని ఏ చక్రం కారణమో దానికి కాస్మిక్ ఎనర్జీ ద్వారా పునరుత్తేజం చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆలయంలో గంట కొట్టడం లో ఆరోగ్య రహాస్యం ----
సాధారణంగా గంటను సప్త ధాతువులతో తయారు చేస్తారని జింక్,సీసం,రాగి ,నికిల్,క్రోమియం, మాంగనీస్ అనే 7 రకాల లోహాలు,శరీరం లో ఉండే 7 చక్రాలకు సంబంధించినవే,గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదునుగా ఉంటుంది.దాదాపు ఏడూ సెకండ్ల పాటు వినిపిస్తుంది. అంతేకాక మరి ముఖ్యంగా శరీరంలో ఉన్న ఏదు ముఖ్యమైన చక్రాలు గంట కొట్టిన తరువాత నుండి కొన్నికణాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిప్రభావాం వల్ల ఒకరకమైన ట్రాన్స్ లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈకారణంగా మెదడు సానుకూల శక్తితో నిండి ఉండడాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
అభిషేఖం ఆరోగ్య రహాస్యం...
ముఖ్యంగా భగవంతుడి మనం లేదా మీరు చేసే అభిషేఖం లో వాడే తులసి, కుంకుమ, పూవులు, కర్పూరం, ఆవు పాలు,పటిక,ఏలకులు,లవంగాలు,కొబ్బరి నీళ్ళు కలిపిన మిశ్రమం తోకూడిన జలాని అభిషేకానికి వినియోగిస్తారు.వీటిలో అన్నిరకాల ఔషద గుణాలు కలిసి ఉన్నాయని భక్తులందరికీ ఈ పవిత్రజలాన్ని ౩ చెంచాలు గా తీర్ధం రూపం లో భక్తులకు ఇస్తూ తీసుకుంటారు.
బొట్టు...
హిందూ సామ్రాదాయం లో బొట్టుకున్న స్థానం వేరుగా ఉంటుందని చెప్పాలి.బొట్టు అజ్ఞా చక్రాన్ని యాక్టి వేట చేస్తుందని చెప్పవచ్చు. భగవంతుడి వద్దకు వెళ్ళిన ప్రతివారు తప్పుచేసినవారు క్షమాపణ కోరుతూ లెంపలు వేసుకోవడం లేదా గుంజీలు తీయడం కొన్ని తరాలుగా వస్తున్న సాంప్రదాయం.లెంపలు వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యం బ్రెయిన్ యాక్టివేట్ చెయ్యడం కోసం ఒక్కోసారి ఎవరైనా నిద్రావస్థ లోకి వెళుతున్నప్పుడు లేదా కోమాలోకి వేల్లెవాళ్ళను లెంపల మీద కొడుతూ నిద్రపోనివాకుండా చేయడం అంటే వారికి మెలుకువగా ఉంచడమే.
గుంజీలు తీసినప్పుడు మన చెవి నాడులను తాకడం వల్ల మనకు ఒత్తిడి తగ్గి.మెదడుకు ఆక్సిజన్ అందం పెరుగుతుంది.మెదడు చాలా చురుకుగా పనిచేయడమే కాక మంచి ఆలోచనా శక్తితో ఉంటారు.అందుకే అలయాలాలో గుంజీలు తీయమని అందం లోని రహాస్యం. మనసంప్రదాయం లో దాగిన ఎన్నో రహాస్యలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.ఇది అలయఫర్శనం లో ఆరోగ్య రహస్యాలు.