క్రమం తప్పకుండా బెండకాయ తింటే ఇన్ని లాభాలుంటాయని తెలుసా..
posted on Oct 16, 2023 @ 10:14AM
బెండకాయ, లేడీస్ ఫింగర్, ఓక్రా ఇలా పేర్లు ప్రాంతాలకే కానీ కూరగాయ మాత్రం అందరికీ ఒకటే. అమ్మాయిల వేళ్ళలా సుకుమారంగా ఉంటాయని వీటికి ఈ పేరు పెట్టారేమే. లేతగా ఉన్న బెండకాయలు పచ్చివే రుచిగా ఉంటాయి. వీటి విత్తనాలు కాస్త వగరుగా ఉంటాయి. వేగితే మాత్రం వీటి రుచి అద్భుతం. జిగటగా ఉంటుందని పిల్లలు వీటిని ఇష్టపడరు కానీ బెండకాయ నిజంగా గొప్ప ఔషదగుణాలు కలిగి ఉంది. ఇది ఆఫ్రికాకు చెందిన పుష్పించే మొక్క. భారతదేశం, ధక్షిణ అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో కూరగాయగా పరిగణించబడుతుంది.
బెండకాయలో పోషకాలు..
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ A, C పుష్కలంగా ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండే ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలతో సహా యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటుంది. బెండకాయ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అదంటే ఇన్నాళ్లు ఇష్టం లేనివారు కూడా హాయిగా తినేస్తారు. దీని లాభాలేంటో తెలుసుకుంటే..
బెండకాయలో విటమిన్ A, C, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావసిన మొత్తం ఆరోగ్యానికి జీవశక్తికి సహకరిస్తుంది.
బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బెండకాయలో ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బెండకాయలో పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, మధుమేహం ఉన్నవారు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
బెండకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగా ఆకలిని నియంత్రించడం, అతిగా తినడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. బరువును నియంత్రిస్తుంది.
బెండకాయలో విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం బలమైన ఎముకలకు సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధి, ఎముకలు బలహీనంగా ఉండటం, పెలుసుబారడం వంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది.
విటమిన్ ఎ, సితో సహా బెండకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి , చర్మం కాంతివంతంగా మారడానికి సహాయపడతాయి. అవి అకాల వృద్ధాప్యం, ముడతలను నివారించడంలో కూడా సహాయపడతాయి.
*నిశ్శబ్ద.