గోవా వెళ్లండి... రమ్ మిక్స్ టీ తాగి తూగండి!
posted on Nov 5, 2022 @ 4:30PM
టీ అనేక రకాలు.. వాటిలో గ్రీన్ టీ ఆరోగ్యానికి మరీ మంచిది అంటున్నారు. భారీ ప్రచారాలు జరుగుతు న్నాయి. కానీ టీ లో మరేదయినా కలిపితే? ఎప్పుడూ ఒకేలా టీ, కాఫీ తాగడం దేనికి. ఏదో కొత్తదనం ఉండాలనుకునే కుర్రాళ్లకి ఒక రెస్టారెంట్ వారు కొత్తరకం టీ తయారుచేస్తున్నారు. దాని పేరు మాంక్ టీ అంటున్నారు. ఇదేదో ఫారిన్ డ్రింక్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది పక్కా ఇండియన్ బ్రాండ్ టీ. అవును కాబోతే దీని కోసం గోవా వెళ్లాలి. ఒక్క కప్పు టీ తాగడానికి గోవా వెళ్లాలా అంటే మరి కొత్తరకం కాంబినేషన్ టీ సామాన్యమైనది కాదు.. ఓల్డ్ మాంక్ తో కలిసిన టీ. అవును మీరు చదువు తున్నది కరష్టే.
అసలు గోవా అంటేనే సరదాల మయం. గోవా ట్రిప్ అంటేనే కుర్రాళ్లకి, సరదాగా కొద్దిరోజులు గడపాలను కునే టూరిస్టులకు పెద్ద ఎంటర్టైన్మంట్ సెంటర్. అక్కడ అన్నీ తమాషాలే. అన్నీ వింతలే. దానికి ఇప్పుడు కొత్తగా కొత్తరకం టీ ఒకటి యాడ్ అయింది. వింతల్లో వింత కాదు.. మందు మార్బల్యంలో కొత్త సరదా.
గోవా కాండోలిమ్లోని సింకెరిమ్ బీచ్ వద్ద ఒక చిన్న టీ డాబా. ఇప్పుడది పెద్ద అట్రాక్షన్ అయిపోయింది. కారణం ఓల్డ్ మాంక్ టీ. అక్కడ మామూలు టీ, కాఫీ లతొ పాటు ఈకొత్తరకం టీ, కాఫీ లనూ అమ్ము తున్నారు. చిన్న మట్టి పాత్రను కాస్త వేడి చేసి అందులో కొద్దిగా ఓల్డ్ మాంక్ రమ్ పోస్తారు. తర్వాత బాగా కాచిన టీని అందులో కలుపుతారు. తర్వాత మట్టిపాత్రలోని ఈ వింత పానీయాన్ని మరో మట్టిపాత్రలో పోసి దాన్ని తాగడానికి ఇస్తారు. అన్నట్టు ఇదంతా ఒక టీ కప్పు సైజు టీ మాత్రమే ఉంటుంది. కాఫీ లోకూడా అంతే ఒక స్పూన్ ఓల్డ్ మాంక్ రమ్ వేడి కాఫీలో కలుపుతారు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారుగా.. ఇదో కొత్త పానీయం.. దీన్ని మాంక్ టీ అంటున్నారు. దీన్ని తయారీ కూడా వీడియో తీసి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.గోవా వెళితే ఇక జనం తప్పకుండా మాంక్ టీ తాగకుండా తిరిగిరారేమో.