మళ్ళి' ఆయన ' నోరు జారారు
posted on Feb 16, 2016 @ 10:02AM
ప్రజా ప్రతినిధులు , అధికారుల పై నోరుపారేసు కోవటం తరుచు వింటుంటాం. ఒకో సారి పదిమంది లో పట్టుకుని అధికారుల్ని దులిపేయటం, నోటికి వచ్చింది అనేయటం జరుగుతుంటుంది. మీడియా వుంది , కెమెరాలు వున్నాయి వారు అన్నది , అన్నట్టు రికార్డు అవుతుంది అన్నది మర్చి పోయి ...ఆహా ..మాకే పాపం తెలియదు ..మేమేం అనలేదు అంటూ మాట మారుస్తుంటారు . ఇప్పుడు కూడా అదే జరిగింది. పబ్లిక్ గా మీటింగ్ లో ఒక ఇంజనీర్ ని పట్టుకుని ...నువ్వేం చదివావ్ ? నీ మాటలేంటి ? అంటూ బూతులు తిట్టారు ..స్వయం గా ఓ రాష్ట్ర మంత్రి గారు . ఆ తర్వాత అబ్బే ..నేనేం అలా అనలేదు అంటూ మాట మార్చారు.. ఇప్పుడు ఆ వీడియో ఎలెక్ట్రానిక్ మీడియా లో దుమ్ము రేపుతోంది.
హర్యానా మంత్రి క్రిషన్ బేడి కి ఇది మొదటి సారి కాదు ..ఇలా పబ్లిక్ గా అధికారుల మీద నోరుపారేసు కోవటం ఇంతకు ముందు కుడా చేసారు..ఏమయినా ..అధికారులని ఏం చదివావ్ అంటూ అడిగి మరి ఎద్దేవా చేసేలా మాట్లాడే వీరిని తిరిగి ..మీరేం చదివారు అంటూ అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అంటూ జనం వీరి ప్రవర్తన మీద నిరసన తెలియ చేయటం అప్పుడే మొదలెట్టారు ..ఏమయినా ఒక పబ్లిక్ సర్వంట్ ని ఇలా పబ్లిక్ గా అవమానించటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. మరి అది ఆ మంత్రి గారి చెవి దాకా వెళ్తుందా ? చూద్దాం..మన ప్రజాప్రతినిధుల ఈ నోరు జారుడు కి మందు ఏంటో ?