ఐసిసి అవార్డ్ పోటీలో హర్మన్‌ప్రీత్, స్మృతి, అక్షర్
posted on Oct 6, 2022 @ 1:13PM
అంతర్జాతీయ క్రికెట్ సంస్థ ఐసిసి ప్రతీ నెలా ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకి భారత్ మహిళా క్రికెట్ స్టార్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, పురుషుల జట్టు నుంచి స్పిన్నర్ అక్షర్ పటేల్ పేర్లు నామినేషన్‌లో ఉన్నాయి.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధనా పేర్లు అధికారుల దృష్టిలోకి రావడం ఇదే మొదటిసారి. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే, టీ-20 సిరీస్‌ల్లో వారిద్దరూ అద్భుతంగా ఆడారు. కౌర్ మూడు ఓడిఐల్లో అత్యధికంగా 221పరుగులు చేయడంలో గొప్పబ్యాటింగ్ నైపు ణ్యం ప్రదర్శించి అందరి మన్ననలు అందుకుంది. 1999 తర్వాత భారత్ మహిళల జట్టు ఇంగ్లండ్‌లో ఆ జట్టును ఓడించడంలో ఆమె అసమాన ప్రతిభ ప్రదర్శించి 143 పరుగులు చేయడమే కాకుండా సిరీస్ గెలిచి చరిత్రసృష్టించింది. సెప్టంబర్‌లో ఇంగ్లండ్తో తలపడిన సిరీస్‌లో కెప్టెన్ తో సమానంగా ఉన్నత స్థాయి బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించిన స్టార్ బ్యాటర్ మంధన. గతేడాది ఆమె ఐసిసి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందుకున్న భారత్ స్టార్. వైట్‌బాల్ టీ20 సిరీస్‌లో డెర్బీలో 79 పరుగులు చేసి జట్టును ఆదుకుం ది, అలాగే క్యాంటర్‌బరీలో జరిగిన వన్డేలో అత్యధికంగా 91 పరుగులు చేసి జట్టు విజయానికి ఎంతో సహకరించింది. అమె ఇన్నింగ్స్‌ను అక్కడి పత్రికలో ఎంతో మెచ్చుకున్నాయి. మంధన సెప్టెం బర్‌లో ముగిసిన రెండు సిరీస్‌ల్లోనూ 50 యావరేజ్‌తో ఉన్నది. ముఖ్యంగా టీ20ల్లో ఆమె స్ట్రయిక్ రేట్ 137 ఉంది. అలాగే, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా కూడా ఐసిసి అవార్డు పోటీలో మూడవ స్థానంలో నిలిచింది.
కాగా , అక్షర్ పటేల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ 20 సిరీస్‌ల్లో గొప్పగా రాణించాడు. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ పురుషుల విభాగంలో భారత్ నుంచి అతని పేరును లెక్కలోకి తీసుకున్నారు. అక్షర్ 11.4 యావ రేజ్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన తో జట్టు విజయానికి తోడ్పడ్డాడు. ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రీన్, పాకిస్తాన్ కీపర్ రిజ్వాన్ ఇద్దరూ కూడా ఐసీసీ అవార్డు పోటీలో ఉన్నారు.