సంస్కృతంలో క్రికెట్ కామెంటరీ!
posted on Oct 6, 2022 @ 2:23PM
క్రికెట్ అనగానే చెవులు కోసుకునేవారంతా రేడియో కామెంట్రీ తెగ యిష్టపడేవారు. టీవీ ప్రత్యక్ష ప్రసారా లకు ముందు రేడియోలో హిందీ, ఇంగ్లీషు కామెంటరీకి ఎంతో క్రేజ్ ఉండేది. ముఖ్యంగా ఇంగ్లీషులు డాక్టర్ చక్రవర్తి అనే ఆయన కామెంట్రీ అద్బుతం. ఆయన 1975 వరల్డ్‌కప్ కామెంట్రీకి దేశంలో క్రికెట్ వీరాభిమానులంతా ఫిదా అయ్యారు.
అంటే హిందీ, ఇంగ్లీషుల్లో వినడానికి ఎగప డటం ఇప్పటికీ ఉంది. టీవీల్లో ప్రత్యక్షప్రసారం వచ్చినప్పటి నుంచి మరింత ఆదరణకు నోచుకున్నారు. కాగా తెలుగు, తమిళం, గుజరాతీ కామెంటరీ, ప్రత్యేక కార్య క్ర మాలు నిర్వహించడం అనేవి ఇపుడు చూస్తున్నాం, వింటున్నాం. కానీ మనదేశంలో భాషలకు మూల మయినదిగా చెప్పుకునే సంస్కృతంలోనూ క్రికెట్ కామెంటరీ చెబితే! 140 కి.మీవేగశ్య బూమ్రా బంతేన గచ్ఛతి, బ్యాటరేన సాస్టాంగ...అంటూ చెబితే వినేవాడికి పిచ్చెక్కుతుంది. పుస్తకాల భాషలో ఈ విధంగా చెబితే వినేవాడికి వాడి భాష మర్చిపోయే అవకాశమూ ఉంటుంది.
కానీ కర్ణాటకాలో ఏకంగా ఒక గ్రామం అంతా సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. రోజూవారీ దినచర్య అదే భాషలో సాగుతుంది. కొంత కాలం క్రితం వారణాసిలో సంస్కృత విశ్వవిద్యాలయంవారు ఒక టోర్నీ నిర్వహించారు. ప్లేయర్లంతా శుబ్భరంగా పంచకట్టుకుని మరీ ఆడారట!
తెలుగులో కామెంట్రీ ఆరంభమయిన కొత్తల్లో అంతా నవ్వుకున్నారు. కానీ ఇపుడు అదే చాలామంది ఇష్టప డుతున్నారు. కానీ సంస్కృతం కష్టమే. అయితే బెంగుళూరులో సరదాకి ఓ పెద్దమనిషి లోకల్ టాలెంట్‌ని ఉత్సాహపర్చేందుకు ఓ ఆటకి సరదాగా సంస్కృతంలో కామెంటరీ చెప్పారు. సరే అది గల్లీ మ్యాచ్ గనుక వీడియో చూసినవారు, విన్నవారు ఎంతో ఆనందించారు. ఆ వీడియో ఇపుడు వైరల్ అయింది. కారణం ఆయన ఇంగ్లీషులో చెప్పినంత వేగంగా చెప్పడం! అరే ఎంత అద్భుతంగా చెప్పాడో అంటున్నారు నెటిజన్లు!
సరే క్రికెట్ గనుక ఆట చాలామందికి తెలుస్తుంది గనుక ఏదో తంటాలు పడి విన్నా ఆట తెలుస్తుంది. మరీ అదే ఏ ఉత్సవాలకో, మరేదయినా పెద్ద ఫంక్షన్ తాలూకు కామెంటరీనో అయితే !?