గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 1, 5
posted on Nov 3, 2022 @ 1:57PM
గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుతాయి. ఫలితాలు 8న ప్రకటిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం ప్రకటించారు. 182 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో కి వస్తుంది.
ఈ ఏడాది ఎన్నికల్లో 4.9 కోట్లమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రం మొత్తం మీద 51 వేల పోలింగ్ బూత్ లు నెలకొల్పనున్నారు. వీటిలో 34 వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారు. పోలింగ్ సమయానికి బాగా ముందుగానే రాష్ట్రంలో 160 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను మోహరించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పోటీకి ఎంతో ఆస్కారం ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో పాటు, ప్రధాని మోదీ స్వరాష్ట్రం కూడా కావడంతో గుజరాత్ ఎన్నికలు ప్రాధాన్యతసంతరించుకున్నాయి.