సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ .. చేతులెత్తేసిన బిఆర్ఎస్
posted on Dec 22, 2023 @ 12:00PM
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్ కు గురయ్యారు. యూనియన్ కు చెందిన ముగ్గురు టాప్ లీడర్లు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకుండాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వీరు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ... ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం ఆత్మహత్యాసదృశ్యమేనని అన్నారు. పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమని చెప్పారు. కాగా, అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.
సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ టీబీజీకేఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయం పై టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్‌లో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించనున్నారు. కేసీఆర్ నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యమన్నారు. ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజి రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వాలు, యాజమాన్యం అడ్డుకుందామని ప్రయత్నించినా వాటి కుయుక్తులు పని చేయలేదు. కేంద్ర లేబర్ కమిషనర్ ఎన్నికల తేదీ ప్రకటించగా, నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికల నిలుపుదలకు కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. కానీ ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిం ది. దీంతో కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేసున్నారు. సింగ రేణి గుర్తింపు ఎన్నికల గడువు ముగిసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ముందుకు వెళ్లడం లేదు. గత ప్రభుత్వ అండదండలతో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. ఎన్నికలు జరుపాలని కార్మిక సంఘాలు ముక్తకంఠంతో కోరుతున్నప్పటికి పెడచెవిన పెట్టింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రరుంచడంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది.