రైల్వే బడ్జెట్: ఆంధ్ర-తెలంగాణకు ఇవే
posted on Jul 8, 2014 @ 3:35PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 29 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్ తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రూ.20,680 కోట్లతో పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు.
ఆంధ్ర-తెలంగాణకు కేటాయించినవి:
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.20,680 కోట్లు అవసరం.
2. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పూర్తి సహకారం.
3.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
4. నాగపూర్-సికింద్రాబాద్ మధ్య సెమీ బుల్లెట్ ట్రయిన్.
5. చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు.
6. విజయవాడ-ఢిల్లీ మధ్య ఏసీ ఎక్స్ప్రెస్ కొత్తరైలు.
7. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య కొత్త రైలు.
8. విశాఖ-చెన్నై మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.
9.పారాదీప్-విశాఖ మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్.