టేలర్ హైస్కూల్ చరిత్ర కాలగర్భంలో!
posted on Jun 29, 2023 @ 4:13PM
నూట డెబ్భై ఏళ్ల చరిత్ర కలిగిన నరసాపురం టేలర్ హైస్కూల్ ఘనత ఇక గత చరిత్రగా కాలగర్భంలో కలిసిపోయింది. 150 కోట్ల విలువైన ఆస్తులున్నప్పటికీ ఈ హైస్కూల్ మూతపడే పరిస్థితికి రావడానికి కారణాలెన్నో ఉన్నాయి. అయితే ప్రధాన కారణం మాత్రం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరించిన, అనుసరిస్తున్న విధానమే కారణం అని చెప్పాలి.
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ హైస్కూల్ ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోయింది. ఈ హైస్కూల్ చరిత్ర ఆషామాషీది కాదు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ హైస్కూల్ లోనే చదివారు. అంతేనా ప్రసిద్ధ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు, నటుడు కృష్ణం రాజు వంటి ఉద్దండులెందరో ఈ హైస్కూల్ లోనే చదివారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ అంటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలగా ఉన్న ఈ హైస్కూలు బుధవారం (జూన్ 28)నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది.
ప్రస్తుత కరస్పాండెంట్ పోతుల జగన్ ఈ విద్యా సంస్థను ప్రభుత్వానికి అప్పగిస్తూ.. సంబంధింత పత్రాలను జిల్లా అధికారులకు అందజేశారు. ‘స్కూల్‌కు ఆదరణ తగ్గడం, సిబ్బంది కొరత, ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి తదితర కారణాలతో స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది.