ధర్మానను రక్షించేందుకు ప్రభుత్వ నాటకం?
posted on Aug 20, 2012 8:54AM
రాష్ట్రరెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావును రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కప్పదాటు చర్యలు చేపడుతోందని విమర్శలు వ్యాపించాయి. ధర్మాన రాజీనామాను సిఎం, ప్రభుత్వం ఆమోదించిన తరువాత చివరిగా గవర్నర్ ఆమోదానికి వెడుతుంది. ముందే గవర్నర్ నరసింహన్‌కు పంపించేశామని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఆ విషయంలో తన నిర్ణయం ఏమీ ఉండదని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. మంత్రి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనకు పంపిస్తే దాన్ని ఆమోదిస్తానని ఆయన పునరుద్ఘాటించారు. మరి ఆ రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండిరగులో పడిరదని గవర్నర్ మాటలను బట్టి అర్థమవుతోంది. అంటే గవర్నర్‌ను తెరపై చూపి మంత్రి ధర్మాన రాజీనామాను ఆమోదించకుండా కాలక్షేపం చేద్దామనుకున్న సిఎం ప్లాను తలకిందులైంది. మొత్తం విషయం గవర్నర్ ప్రకటనతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నాటకాలు ఆడి ధర్మానను రక్షించేందుకు కసరత్తులు చేస్తోందని ఎవరూ చెప్పాల్సిన పని లేకుండా ప్రతిపక్షాలూ అర్థం చేసుకున్నాయి. సిఎం కిరణ్ తెలివితేటలు కూడా ఒకరకంగా వెలుగులోకి వచ్చినట్లే. సిఎం ఇకనైనా నాటకాలు ఆపి మంత్రి వ్యవహారం తేల్చాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. ఇంకోవైపు ధర్మాన వ్యవహారం తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎలర్ట్‌గా వ్యవహరిస్తోంది.