హరికృష్ట , బాలకృష్ణ మద్య తెలంగాణ చిచ్చు
posted on Aug 20, 2012 8:57AM
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తన రెండు కళ్ల సిద్దాంతానికి తెరదించి తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించింది. దీనిపై హరికృష్ణ , బాలకృష్ణ చెరొకవైఖరితో అడుగులు వేస్తున్నారు. హరికృష్ణ ఇప్పటికీ సమైఖ్యాంద్రా నినాదాన్నే కొనసాగిస్తుండగా, బాలకృష్ణ మాత్రం అవసరమైతే తెలంగాణకు అనుకూలంగా మరొక లేఖ కేంద్రానికి రాయటానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉంటామని వాఖ్యానించారు.దీనిపై ఘాటుగా స్పందించిన హరికృష్ణ తనలో నందమూరి తారక రామారావు రక్తం ప్రవహిస్తున్నంత కాలం సమైఖ్యాంద్రకే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో హరికృష్ట ప్రత్యేక రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం అని తెలంగాణ పార్టీ అద్యక్షుడు కెసిఆర్‌కు లేఖ రాశారు. దీనిపై ఎర్రబెల్లి దయాకర్ అది హరికృష్ణ స్వంత అభిప్రాయంగా ప్రకటించారు. పార్టీలో చాలా మంది పొలిట్ బ్యూరో సభ్యులున్నారని ఆయనొక్కడే కాదని వాఖ్యానించారు.
ఆ సమయంలో హరి ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగా పార్లమెంటు బయటకూడా అనేక సార్లు సమైఖ్యాంద్రా నినాదాన్నే కొనసాగిస్తున్నారు. తెలంగాణ వ్యవహారంలో ఎర్రబెల్లి, కడియం శ్రీహరివంటి నేతలు చంద్రబాబునాయుడిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం అధికారంకోసం విధానాలను మార్చుకోవడం మంచిది కాదని కూడా చెబుతున్నారు.దీని వల్ల సీమాంద్రలో పార్టీ దెబ్బతింటుందన్నారు. అయితే తెలంగాణకు అనుకూలంగా పార్టీ లేఖ ఇచ్చినంత మాత్రాన దానిని ఆధారం చేసుకొని కేంద్రం నిర్ణయం తీసుకోదన్న వాస్తవం గుర్తించాలని, ఆవిషయాన్ని ప్రజలకు తెలియచేసేకంటే ముందు నేతలు గ్రహంచాలంటున్నారు. కాంగ్రెస్ తనకు రాజకీయంగా లాభదాయకంగా ఉంటే తప్పనిర్ణయం తీసుకోదని, ఆలోగా అన్ని పార్టీల్లో చీలిక తేవడమే దాని లక్ష్యమని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై తన అభిప్రాయం చెప్పాలని, అన్ని పార్టీలమద్య ఏకాభిప్రాయం కావాలని, ఇవన్నీ పూర్తికావాలంటే చాలాకాలం పడుతుంది కాబట్టి తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే వచ్చే నష్టం మేమీలేదని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు.