జనసేనా లేక వైసీపీనా?.. రాపాక వైఖరితో సతమతమవుతున్న కార్యకర్తలు
posted on Dec 16, 2019 @ 1:24PM
తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వేస్తున్న అడుగులు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీకి ఆయన దగ్గరవుతున్నారని.. త్వరలో చేరుతారని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీంతో రాజోలు నియోజక వర్గాల్లో వైసీపీ శ్రేణులు అప్రమత్తమవుతున్నాయి. రాపాక రాకుండా అడ్డుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. ఈ మధ్య జనసేన ఎమ్మెల్యే రాపాక జగన్ కు సన్నిహితంగా ఉంటున్నారు.
దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్న బొంత రాజేశ్వర్ రావును కాదని అమ్మాజీకి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంపైనా బొంతు వర్గం భగ్గుమంటోంది. రాజోలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఎవరికీ అంతుబట్టడం లేదు. అటు రాపాక ఇటు అమ్మాజీ మధ్య గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఇన్ చార్జి బొంతు పరిస్థితి అయోమయ స్థితిలో పడింది. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందన్న వార్తలను బొంతు రాజేశ్వరరావు అంగీకరించడం లేదు.
కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే రాపాక పాల్గొంటున్నారని పార్టీతో సంబంధం లేదంటున్నారు. రాజోలు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్నటి వరకు కూడా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీ వీడుతున్నారంటూ కొన్ని ఆరోపణలొచ్చాయి. అలాగే జనసైనికులు కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ రాజకీయాలు యూటర్న్ చేసుకున్నాయి. వైసీపీ ఇన్ చార్జ్ బొంతు రాజేశ్వరరావుని పక్కన పెట్టారంటూ కూడా రాజేశ్వరరావు అనుచరులూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి.