జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ ఓటు..
posted on Feb 2, 2016 @ 2:51PM
జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా విచిత్రకరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే.. కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ లేని వాళ్ల పేర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాలోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పేరు వచ్చి చేరింది. ఈరోజు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో గౌలిపుర డివిజన్ లో ఒక ఓటరు పేరు సల్మాన్‌ఖాన్, తండ్రిపేరు సలీమ్‌ఖాన్‌గా పేర్కొంటూ సల్మాన్ ఫొటోతో జాబితాలో ఓటు ఉంది. అంతేకాదు అందులో సల్మాన్ వయసు 64 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాబితాలో ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.