మీరూ ఓటేయ్యండి.. ఎన్టీఆర్.. ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్
posted on Feb 2, 2016 @ 12:52PM
జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రానికి తన తల్లి, భార్యతో వచ్చి ఓటు వేశారు. ఈసందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఓటు హక్కును తాను వినియోగించున్నానని.. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది అందరూ వచ్చి ఓటేయండి అని విజ్ఞప్తి చేశారు. ఓటుపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చానని తెలిపారు.
కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.