గ్యాస్ రాయల్టీ రాబట్టవలసిందే
posted on Aug 19, 2012 @ 11:17AM
కేంద్రం నుండి రాష్ట్ర అవసరాలకు గ్యాస్ సాధించలేనప్పటికీ కనీసం మన కేజీ బేసిన్ గ్యాస్ పై రాయల్టీ అయినా దక్కించు కోవాలని విద్యుత్ అధికారులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్యాస్ ఇతర సహజవనరులపై రాయల్టీ కోరటానికి మనకు అధికారం ఉందని వారు తెలియ చేస్తున్నారు.
అంతేకాకుండా మన పొరుగు రాష్ట్రామయిన తమిళనాడు కాని మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలయితే ఇప్పటికే రాయల్టీ ముక్కు పిండి వసూలు చేసేవారని చెబుతున్నారు. గ్యాస్ ఇతర సహజవాయువులు కేంద్రం జాబితాలో ఉన్నప్పటికీ మన అవసరాలకు సరిపడా గ్యాసు ఆయా సంస్దలు కెటాయించటంతో పాటు రాయల్టీ కూడా కట్టాల్సి ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పూర్తి భాద్యత వహించాలని నిపుణులు భావిస్తున్నారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలకోసం పార్టీల కతీతంగా పోరాటం చేయవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తర ప్రదేశ్ తన భూభాగం నుండి గ్యాసు పైపు లైన్లు డిల్లీకి, ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయని తమకు పన్ను చెల్లించాలని ఇప్పటికే కోర్టులో కేసులు వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గ్యాస్ నిక్షేపాలు, తవ్వకాలతో సంబందంలేని రాష్ట్రాలే వ్యాట్ ఇతర పన్నులతో ఆదాయాన్ని పెంచుకుంటుంటే మనరాష్ట్రం మాత్రం గ్యాస్ నిక్షేపాలగని ఉన్నా పైసా దక్కించుకోపోవడం పై ఆర్దిక నిపుణులు పెదవివిరుస్తున్నారు.