అస్సాం అల్లర్లు: వెలవెలబోతున్న సెక్యూరిటీ ఏజెన్సీలు
posted on Aug 19, 2012 @ 11:03AM
అస్సాం అల్లర్లల నేపధ్యంలో భారతదేశంలోని అన్ని ప్రధాన పట్టణాలనుండి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇంటిదారి పడుతున్నారు. ఈ నేపధ్యంలో రోజూ వేలమంది కాలేజీలను, ఉద్యోగాలను వదిలి స్వంత రాష్ట్రానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ శాన్యరాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా ప్రయివేట్ సెక్యూరిటీ ఏజెన్సీలలో పనిచేస్తారు. అల్లర్ల నేపధ్యంలో రోజుకు 5000 మంది హైదరాబాద్‌ను విడచి వెళ్లటం వల్ల ప్రవేటు సెక్యూరిటీ సంస్ధలకు చిక్కొంచ్చింది. ఈ సంస్ధల నుంచి సెక్యూరిటీ గార్డులుగా స్కూళ్లు, కాలేజీలకు, అఫీసులు మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సంస్ధలలోనూ పనిచేస్తుంటారు.
సెక్యూరిటీ సంస్ధలలో ఈ శాన్య రాష్ట్రాలకు చెందిన వారు 70 శాతం ఉంటారు. వీరంతా మూకుమ్మడిగా ఇంటిదారి పట్టడంతో అనేక సంస్థలకు సెక్యూరిటీ సమస్య తలెత్తింది.దీంతో రైల్యే పోలీసులు రైల్యేపోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారిలో ధైర్యం తామున్నామని సహోదరత్వాన్ని చాటుతూ వెళ్లిన వారిని కూడా తిరిగి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. అంతవరకు మాదాపూర్, మియాపూర్ స్టాఫ్ వేర్ సంస్ధల దగ్గర పోలీస్ పెట్రోలింగ్ పెంచడానికి పోలీస్ శాఖ తమ సంసిద్దతను తెలియచేసింది.ఈ సంఘటనతో అసలే నిత్యం వత్తిడితో వుండే పోలీసులపై మరింత వత్తిడి పడిరదని పోలీసులు భావిస్తున్నారు. వీలయినంత త్వరలో ఈశాన్య రాష్ట్రాల ఉద్యోగులు వెనుతిరిగాలని ప్రజలు కోరుకుంటున్నారు.