గన్నవరం పోలీసుల కస్టడీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గన్నవరం కోర్టు శంశీని ఒక్కరోజు కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించడంతో విజయవాడ వచ్చిన గన్నవరం పోలీసులు విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోనికి తీసుకున్నారు. జైలు నుంచి ఆయనను కంకిపాడు పోలీసు స్టుషన్ కు తరలించారు. అంతకు ముందు జైలు నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.

వైద్యులిచ్చిన నివేదిక ఆధారంగా వంశీ ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించుకుని అక్కడ నుంచి కంకిపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ వంశీని విచారిస్తున్నారు.  ఇంతకీ గన్నవరం పోలీసులు వంశీ కస్టడీని ఎందుకు కోరారంటే.. ఉమ్మడి జిల్లా అత్కూరు మండలంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి అతని పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని కొందరు ఆక్రమించుకుని, అప్పటికి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ సహకారంతో వారి పేర కుట్రపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై బాధితుడు శ్రీధర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఈ కుట్రకు సూత్రధారి వంశీయేనని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వంశీని కోర్టు అనుమతి మేరకు ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు.  

Teluguone gnews banner