ఆసిఫాబాద్ లో అరుదైన పెళ్లి... ఇద్దరు భార్యల ముద్దుల భర్త
posted on Mar 29, 2025 @ 2:30PM
తెలంగాణ కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓ యువకుడు పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించాడు. ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అనుకుంటే పొరబడినట్టే. ఇద్దర్ని ప్రేమించానని ఆ యువకుడు ప్రేమించిన యువతులకు చెప్పినప్పటికీ ఆ యువతులకు కోపం రాలేదు. మేమిద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటామన్నారు. లింగాపూర్ మండలం గుమ్మూర్ కుచెందిన సూర్యదేవ్ ఇద్దరు యువతులను ఒకే సారి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు. శుభలేఖలు కూడా పంచాడు. పెళ్లి వేడుకను చూడటానికి భారీ సంఖ్యలో జనం వచ్చినప్పటికీ ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ అన్ని మర్యాదలు చేశాడు. గిరిజన సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది. ఇద్దరు యువతుల మెడలో తాళికట్టడంతో వారు వైవాహిక జీవితంలో ఎంటరయ్యారు. సూర్యదేవ్ కు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు. ఒక సాధారణ రైతు మాత్రమే. వేర్వేరు గ్రామాలకు చెందిన యువతుల తల్లిదండ్రులను కూడా ఒప్పించి పెళ్లి చేసుకున్న సూర్యదేవ్ ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా మారిపోయాడు.