దుబాయ్ పర్యటన ముగించుకుని హుటాహుటిన వెనక్కు మంత్రి గంగుల
posted on Nov 9, 2022 @ 4:19PM
కుటుంబ సభ్యులతో కలిసిమంగళవారం(నవంబర్ 8న) దుబాయ్ పర్యటనకు వెళ్లిన గంగుల తన నివాసంలో ఐటీ, ఈడీ అధికారుల సోదాల విషయం తెలియగానే హుటాహుటిన పర్యటనను ముగించుకుని వెనక్కు బయలు దేరారు.
మంత్రి గంగుల నివాసం తాళం వేసి ఉన్నప్పటికీ ఐటీ, ఈడీ అధికారులు తలుపులు పగులగొట్టి మరీ లోనికి వెళ్లారు. కరీంనగర్ లో గంగుల నివాసంతో పాటు ఆయన సోదరుడు గంగుల వెంకన్న నివాసంలో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు.
అలాగే మరో నాలుగు చోట్ల కూడా ఐటీ, ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై గతంలోనే ఈడీ నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం 20 బృందాలు ఈ తనిఖీలలో పాల్గొన్నట్లు చెబుతున్నారు.