నయీంతో లింకులు.. టీఆర్ఎస్ నేత అరెస్ట్..
posted on Sep 27, 2016 @ 11:29AM
గ్యాంగస్టర్ నయీం ఎన్ కౌంటర్ తరువాత.. నయీంతో పులు రాజకీయ నేతలకు పోలీసు అధికారులకు లింకులు ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క రాజకీయ నేత పేరు ప్రత్యక్షంగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా నయీంతో లింకులు ఉన్న ఓ నేతను అరెస్ట్ చేశారు. తెలంగాణలో అధికార పార్టీలో ఉన్న తెరాస నేత బల్లె ఈశ్వరయ్య అరెస్ట్ అయ్యారు. బల్లె ఈశ్వరయ్య మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం తెరాస అధ్యక్షుడు. ఆయన నయీంకు అత్యంత సన్నిహితుడని, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నయీం వ్యవహారాలను అతనే చక్కబెట్టేవాడని.. నయీం చేసిన అక్రమ భూకబ్జాల్లోనూ బలవంతం వసూళ్లలోనూ అతను పాలు పంచుకునే వాడని (సిట్) ప్రత్యేక దర్యాప్తు బృందం చెబుతుంది. ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా నయీంతో సంబంధాలున్న రాజకీయ నేతలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించినట్లు, వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఇప్పటికి ఒక వికెట్ పడింది..మరి ఇంకా ఎంత మంది నేతలు అరెస్ట్ అవుతారో చూద్దాం..