ఆకట్టుకుంటున్న బెయిల్ ఫర్ స్కామ్‌పై ఫ్లెక్సీ
posted on Jul 9, 2012 @ 7:18PM
బెయిల్ ఫర్ స్కామ్ ఆథారంగా ది మూన్‌సేన గుంటూరులో ప్రజాస్వామ్యం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ ఆకట్టుకుంటోంది. దీన్ని రూపొందించిన తీరుపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘రౌడీ దర్బార్...శనక్కాయలు అమ్మే సాంబయ్య కౌన్సిలర్ అయ్యాడు...బెయిల్స్ అమ్మే రౌడీ యాదగిరి ఏమౌతాడో రేపు...ప్రజాస్వామ్యమా నీ పయనమెటు?...’’ అన్న శీర్షికతో ఈ బ్యానర్‌ను రూపొందించారు.
‘‘ఎర వేశాడు డబ్బు జడ్జికి....అమ్మాడు బెయిల్ గాలికి...చిక్కాడు సాక్ష్యంతో ఎసిబికి...పోతున్నాడు చంచల్‌గూడ జైలుకు...ఊపుతున్నాడు చేతులు దేనికీ?...పెడుతున్నాడు దణ్ణం ఎవరికీ?...సాథించాడేమో బహుశా...అర్హత అసెంబ్లీకి...ఎందుకొచ్చింది ఈ అవస్థ వ్యవస్థకి...ఎవరు కారణం ఈ సంస్కృతికి...ఆలోచిస్తే తెలియదా...విజ్ఞులైన ప్రజలకు...’’ అంటూ అక్షరయుద్ధంతో ది మూన్‌సేన ప్రజాస్వామ్యంపై ప్రచారం చేస్తోంది. ప్రత్యేకించి ఈ ఫెక్సీ రూపొందించిన చిత్రాలు, డిజైన్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇటువంటి ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా పెడితే ప్రజాస్వామ్యంలో అక్రమాలను వెలుగులోకి తేవచ్చని, ఇటువంటి అక్షరసమరాల ద్వారానే సమాజంలో మార్పు రావాలని పలువురు బహిరంగంగా ప్రశంసిస్తున్నారు.