రాష్ట్రంలో కానరాని డిఎన్‌ఎస్ ఛేంజర్ మాల్‌వేర్ ప్రభావం!
posted on Jul 9, 2012 @ 7:30PM
ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన ప్రకటన ఇది. డిఎన్‌ఎస్ ఛేంజర్ మాల్‌వేర్ ప్రభావం వల్ల మూడు లక్షల కంప్యూటర్లు ఇంటర్నెట్ సదుపాయాన్ని కోల్పోతాయని హెచ్చరిస్తూ వెబ్‌సెక్యూరిటీ సంస్థ మెకాషీ ప్రకటన జారీ చేసింది. ఈ ప్రభావం వల్ల భారత్‌లోని 21,300కంప్యూటర్లు ఇంటర్నెట్‌కు దూరమవుతాయని పేర్కొంది. అమెరికాలో 69,500, ఇటలీలో 26,500 కంప్యూటర్లు కూడా ఇంటర్నెట్‌కు దూరమవుతాయంది.
భారత్‌లో 50వేల కంప్యూటర్లు డిఎన్‌ఎస్ ఛేంజర్ మాల్‌వేర్ బారిన పడ్డాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌టీం అథికారి తెలిపారు. అయితే ఈ ప్రకటన ప్రకారం ఇప్పటివరకూ ఆంథ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావమూ కనిపించలేదు. ప్రత్యేకించి తమ ఇంటర్నెట్ సదుపాయాన్ని ఎలా కోల్పోయామని వెబ్ సెక్యూరిటీని ప్రశ్నించిన వారూ లేరు. అయితే రాష్ట్రంలో కొద్దిపాటి కంప్యూటర్ సంబంధమున్న ఏ ఇద్దరు కనిపించినా మాత్రం ఈ మాల్‌వేర్ ప్రభావం తమ సంస్థలపై ఎలా ఉంటుందో చర్చించారు. వీరి చర్చల్లో కూడా ఎక్కడా దీని ప్రభావం తమపై ఉంటుందని ఎవరూ పేర్కొనకపోవటం గమనార్హం. రాష్ట్రంలో ఈ మాల్‌వేర్ సోకి ఇంటర్నెట్ సదుపాయాన్ని కోల్పోయిన సంస్థలు అతి తక్కువేనని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. దీనికి తగ్గట్లే ఎటువంటి ఫిర్యాదులు ఇంకా రాలేదు.