భారత్ లో 15 లక్షలు దాటిన కేసులు.. కరోనాపై పోరుకు ఫ్రాన్స్ సాయం
posted on Jul 29, 2020 @ 10:44AM
భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 48,513 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో 768 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,31,669 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,193కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి 9,88,030 మంది కోలుకోగా, ప్రస్తుతం 5,09,447 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా, కరోనా విజృంభణతో అల్లాడిపోతోన్న భారత్ కు ఫ్రాన్స్ సాయం చేసింది. వెంటిలేటర్లు, టెస్ట్ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని పంపించింది. భారత్ లోని ఫ్రాన్స్ రాయబారి ఇమ్యాన్యుయేల్ లెనైన్ వీటిని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అందజేశారు. ఫ్రాన్స్ నుంచి భారత్ కు 50 ఒసిరిస్3 వెంటిలేటర్లు, 70 యువెల్ 800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్ కిట్లు అందాయి.