రాఫెల్ వచ్చేస్తోంది
posted on Jul 29, 2020 @ 11:13AM
భారత వైమానికదళంలో బ్రహ్మస్తం
భారత వైమానిక దళంలో మరో అద్భతమైన అస్త్రం చేరబోతుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విమానాల్లో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ గా గుర్తింపు పొందిన రాఫెల్ భారత్ భూభాగంపై ల్యాండ్ కానుంది. రెండు రోజుల కిందట ఫ్రాన్స్ లో టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం హర్యానలోని అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ లోకు చేరుకోనున్నాయి. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా, సైనిక ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఏడు వేలకు పైగా కిలోమీటర్ల దూర ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు గగనతలంలోనే ఇంధనం నింపుకోని సురక్షితంగా గమ్యస్థానం చేరుతున్నాయి. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 36 యుద్ధ విమానాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మనదేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో ఐదు మాత్రమే ఇప్పుడు భారత్ కు చేరుకుంటున్నాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం అలుముకున్న ప్రస్తుత సమయంలో వీటిని సాధ్యమైనంత త్వరగా దేశ సరిహద్దుల్లోకి చేర్చే ప్రయత్నాలు వైమానిక దళం చేస్తోంది.
రాఫెల్ యుద్ధవిమానం బరువు పది టన్నులు. పొడవు 15.30 మీటర్లు, దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. ఒకసారి ఇంధనం నింపితే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. గంటకు 1912కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ యుద్ధ విమానం 900కిలోల బరువును అవలీలగా తీసుకుపోగలదు. నెక్స్ జెనరేషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ జెట్ ఫ్టైట్ విజువలు రేంజ్ కు మించిన దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తాయి. రెండు ఇంజన్లతో పనిచేసే ఈ ఫైటర్ జెట్ ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్ఫెస్ లో ఉన్న లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ ను ఇవి ప్రయోగిస్తాయి. హర్పూర్, అలారం, పీజీఎం 100, సైడ్ విండర్, అపాచి, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి గమ్యస్థానానికి అతి త్వరగా చేర్చే సామర్థ్యం ఉంది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి అనువైన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ ఈ యుద్ధ విమానాల్లో ఉంటుంది. శత్రుసేనలపై నిమిషానికి 2500 రౌండ్ల పాటు కాల్పులు జరిపేలా 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగల సామర్ధ్యం వీటిలో ఉంది.
వీటిలో మరో ప్రత్యేకత గగనతలం లోనే ఇంధనం నింపుకోగలవు.ఫ్రాన్స్‌తో భారత్ 2016లో ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగలవు. పైలట్లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, రాడార్ రిసీవర్లు ఇందులో అమర్చారు. అంతేకాదు శత్రువుల సిగ్నల్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్ జామర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ లాంటి అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. ఈ యుద్ధ విమానం అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనే కాదు అతిశీతల పరిస్థితుల్లో కూడా సమర్థంగా దూసుకుపోతాయి. మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచుపర్వతాల వెనుక పొంచి ఉండే శత్రుసైన్యాన్ని, వారి స్థావరాలను ఈ యుద్ధ విమానం నామరూపాలు లేకుండా చేయగలదు.