ఇదేం అరాచకం తల్లీ... హోటల్ లో ఫారిన్ టూరిస్ట్ వీరంగం
posted on Dec 19, 2022 @ 3:42PM
అరాచకత్వానికి , విశృంఖలతకు పరాకాష్ట అన్నట్లుగా వ్యవహరించిందో ఫారిన్ టూరిస్ట్. హోటల్ కారిడార్ లో నగ్నంగా తిరుగుతూ సిబ్బందిపై దాడికి పాల్పడింది. మత్తు తలకెక్కితే విచక్షణ మాయమౌతుంది. తామెక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం అన్న ఇంగితం ఉండదు. రాజస్థాన్ లో ఒ విదేశీ టూరిస్టు వ్యవహరించిన తీరు అచ్చం అలాగే ఉంది.ప జైపూర్ లో ఓ విదేశీ మహిళా టూరిస్టు హోటల్ సిబ్బందిపై విరుచుకుపడటం చూస్తే.. ఆమె ఒళ్లు తెలియనంతగా మత్తులో ముగినిపోయి ఉంటుందని అనిపించక మానదు.ప ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ తెగ వైరల్ అవుతోంది.
ఈ సంఘటన జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. విదేశీ వనిత జైపూర్ కు టూరిస్టు గా వచ్చి ఆ హోటల్ లో బస చేసింది. ఏం జరిగిందన్నది తెలియదు కానీ ఆమె నగ్నంగా తన గది నుంచి బయటకు వచ్చింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా..వారిపై ముష్టిఘాతాలతో దాడికి దిగింది. కాలితో తన్నింది. ఆమె ఇంత వయలెంట్ గా ప్రవర్తించడానికి కారణమేమిటన్నది తెలియరాలేదు.
అయితే సిబ్బంది మాత్రం ఆమెను నియంత్రించలేక పోలీసులను ఆశ్రయించారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా తన గది నుంచి బయటకు వచ్చిన ఆ విదేశీ పర్యాటకురాలిని నచ్చజెప్పి గదిలోకి పంపించడానికి ఆ హోటల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
వారామెను సముదాయించడానికి ప్రయత్నించిన కొద్దీ రెచ్చిపోయి దాడులకు దిగింది. ఆమె సిబ్బందిని దూషిస్తూ, దాడి చేయడాన్ని కొందరు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి నెట్టింట పోస్టు చేశారు. ఆ వీడియో వెంటనే వైరల్ అయ్యింది. డ్రగ్స్ మత్తులో ఆమె అలా వీరంగం సృష్టించి ఉంటుందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.