100 రోజుల్లో బిఆర్ఎస్ మడతపెట్టేశాడు....రేవంత్ పాలనలో సంచలనాలు
posted on Mar 15, 2024 @ 5:21PM
గతేడాది డిసెంబరు 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పాలనా పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి… ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని చేపట్టిన రోజు నుంచి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
మాజీ సి.ఎం.ను కంటి మీద నిద్దుల లేకుండా చేశారు. అన్ని వైపుల నుంచి బీ ఆర్ ఎస్‌ను కుమ్మేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఓపిక పట్టి ఆ తరువాతే మాజీ సిఎంను జైలుకు పంపాలని డిసైడ్ చేసుకున్నారట. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి లైన్ కడుతున్నారట. ఆ ఇద్దరు తప్పా మిగతా వారంతా లోక్‌సభ ఎన్నికల తరువాత గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం అయితే జరుగుతోంది.
పాలనపరంగా చూస్తే ఈ వంద రోజుల్లో సి.ఎం. రేవంత్ ఏం చేశారంటే....
1. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,
2. ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది.
3. రూ.500కే గ్యాస్ సిలిండర్,
4. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది.
5. ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది.
ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, నిధులు కేటాయించాల్సి ఉంది.
వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
6. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెతచ్చింది.
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్దిదారుల ఎంపిక చేపట్టింది.
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే
7. 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం.
నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు.
8. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు.
9. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించటంలో గట్టి ప్రయత్నమే చేశారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు.
10. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ.
11. గొర్రెల పంపిణీ పథకం,
12. చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశం.
13. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణ.
14. మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ.
15. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ అధికారుల పాత్రపై విచారణ.
16. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్లకుపైగా వ్యాట్ ఎగవేత. వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు.
17. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చారు.
గద్దర్‌కు విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు.
18. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లుసంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయుల ఆనవాళ్ల వంటి రాచరిక పోకడలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
అందుకే చిహ్నం మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
19. ‘టీఎస్’ ను ‘టీజీ’గా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
దీనిపైనా రేవంత్ వివరణ ఇచ్చారు.
“తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం.
వాహనాలు, బోర్డులపై అంతా టీజీ అని రాసుకున్నారు.
కొందరు యువకులు తమ గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నారు.
కేంద్రం సైతం తమ నోటిఫికేషన్ లో టీజీ అనే పేర్కొంది.
అందుకే టీజీగా మార్చాలని నిర్ణయించాం” అని రేవంత్ వెల్లడించారు.
20. రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’ గీతం ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చిందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా..
ఆ పాటను నిషేధించినంత పని చేశారని బీఆర్ ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించామన్నారు.
21. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా రేవంత్ వివరణ ఇచ్చారు.
“తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి.
తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు.
తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి.
అందుకే.. ఆ విగ్రహంలో కూడా మార్పులు చేస్తున్నాం” అని సీఎం రేవంత్ చెబుతున్నారు.
12కు పైగా ఎంపి సీట్లు గెలిచి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసి తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నేతగా దూసుకుపోతున్నారు సి.ఎం. రేవంత్‌రెడ్డి