పోటెత్తుతున్న జంట జలాశయాలు
posted on Jul 25, 2023 @ 10:48AM
రాష్ట్రంలో పలు జలాశాలయాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు పెరుగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో ఇప్పటికే అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 2000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1761.50 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 1761.75 అడుగులుగా నమోదు అయ్యింది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. అటు ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.10 అడుగులుగా ఉంది. వర్షం కారణంగా ముసారంబాగ్‌లో మూసీ పొంగిపొర్లుతున్నాయి.
అప్పట్లో మూసీ నది పొంగి హైదరాబాద్ కు భారీ వరదలు వచ్చాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రావడంతో మూసీ ప్రవాహం ఎక్కువై హైదరాబాద్ ను ముంచెత్తింది. 1908 సెప్టెంబర్ 28 రాత్రి హైదరాబాద్ కు కాలరాత్రి అని చెప్పొచ్చు. అందరూ నిద్రలోకి జారుకోగానే మూసీ ప్రవాహం ఉప్పొంగి ఇళ్లు కొట్టుకుపోయాయి. నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ పరిపాలనలో హైదరాబాద్ సంస్థానం ఉండేది. పురానాపూల్ బ్రిడ్జి మాత్రమే గోల్కొండ పట్టణం, హైద్రాబాద్ పట్టణానికి మధ్య ఉండేది. ఇక్కడి ప్రజలు అక్కడికి వెళ్లాలన్నా పురానాపూల్ బ్రిడ్జి తప్పితే మరో మార్గం లేదు.
కోసల్ వాడి, అప్జల్ గంజ్ ప్రాంతాల్లో వరద భీకరంగా ప్రవాహించింది. దాదాపు 80 వేళ ఇళ్లల్లో నివసించే వారు నిరాశ్రయులయ్యారు. 15వేల మంది మృత్యువాత పడ్డారు
మూసీ నుంచి వచ్చే వరద అంతకంతకు పెరగడంతో ఉస్మానియా హాస్పిటల్ లో ఉన్న మర్రిచెట్టు దాదాపు150 మంది ప్రాణాలను రక్షించింది.
మూసీ భారీ వరదల నేపథ్యంలో నిజాం రాజు రెండు జంటజలాశయాలను నిర్మించాలని నిర్ణయించారు. అవే ప్రస్తుతమున్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు.