భారతదేశానికి పన్ను విధానాన్ని తీసుకొచ్చింది ఈ మహానుభావుడే..!

 

నెలలవారీ జీతం తీసుకునే వ్యక్తి నుండి ఎవైనా వస్తువులు కొనుగోలు చేయడం, పెద్ద మొత్తం నగదు బహుమతులు, ఇల్లు, కారు సహా చాలా రకాల వస్తువులపై ఇప్పుడు పన్ను చెల్లించాల్సి వస్తోంది.  భారతదేశంలో అసలు ఈ పన్ను చెల్లించే విధానం ఎప్పుడు అమలు అయ్యింది? దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..


భారతదేశంలో పన్ను విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు జేమ్స్ విల్సన్.  ఈయన స్కాటిష్ వ్యాపారవేత్త, మరియు ఆర్థికవేత్త కూడా. 1860 లో ఈస్టిండియా కంపెనీ పాలనలో భారతదేశంలో మొదటిసారిగా పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు.


జేమ్స్ విల్సన్ భారతదేశంలో మొదటిసారిగా జూలై 24,  1860లో పన్నును అమలు చేశారు. అందుకే జూలై 24ను ఆదాయ పన్ను దినోత్సవంగా జరుపుకుంటారు. కేవలం పన్నును మాత్రమే కాకుండా జేమ్స్ విల్సన్ బ్రిటీష్ వారపత్రికను కూడా స్థాపించాడు.


వార్తాపత్రికతో పాటూ జేమ్స్ విల్సన్ స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను కూడా భారతదేశంలో స్థాపించాడు. అంతకు ముందు ఈ బ్యాంక్ చార్టర్డ్  బ్యాంక్ పేరుతో  ఆస్ట్రేలియా, చైనా, భారతదేశంలో ఉండేవి. కానీ ఈ మూడు బ్యాంకులు 1969 సంవత్సరంలో స్ఠాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లో విలీనం చేయబడ్డాయి.


పన్ను విధానాన్ని,  వారపత్రికను,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ను స్థాపించిన జేమ్స్ విల్సన్ మొదట్లో టోపిల తయారీదారుగా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ ఆ తరువాత ఆర్థిక శాస్త్రాన్ని ఇష్టపడ్డాడు. ఈ కారణంగా ఆర్థిక రంగంలో తన వృత్తిని కొనసాగించాడు.  1859లో బారతదేశానికి వచ్చాడు.

1859లో భారతదేశానికి వచ్చిన జేమ్స్ విల్సన్ బ్రిటీష్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడం ప్రారంభించాడు.  1860లో భారతదేశంలో మొదటి ఆంగ్ల మోడల్ పన్ను బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు. ఇందులో లైసెన్స్ పన్ను, పొగాకు పన్ను కూడా ఉన్నాయి.

                                 *రూపశ్రీ.