బాణసంచ దుకాణంలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం
posted on Oct 24, 2022 6:38AM
బాణసంచ దుకాణంలో సంభవించిన అగ్రిప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఏటా ఏర్పాటు చేసినట్లుగానే విజయవాడ గాంధీనగర్ లోని జింఖానా మైదానంలో బాణసంచా దుకాణాలు ఏర్నాటు చేశారు. ఆ దుకాణాలలోని ఓ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవదహనమయ్యారు.
దీపావళి పండుగ వేళ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యాయి. విజయవాడలోని గాంధీనగర్ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచ దుకాణాలలోని ఓ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. ఆదివారం(అక్టోబర్ 23) ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.మైదానంలో ఏర్పాటు చేసన దుకాణాలలోని ఓ దుకాణంలో పేలిన టపాసు కారణంగా ఆ దుకాణం మంటల్లో దగ్ధమైంది. ఆ మంటలు మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి.
దీంతో ఆయా దుకాణాలలోని బాణ సంచ పెద్ద శబ్ధంతో పేలిపోయాయి. ఆ శబ్ధాలకు చుట్టుపక్కన నివసిస్తున్న ప్రజలు భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగుతు తీశారు. అగ్నిమాపక సిబ్బంది రంగ ప్రవేశం చేసి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన ఇరువురూ కూడా ఆయా దుకాణాలలో పని చేసే సిబ్బందిగా గుర్తించారు.
అగ్నిమాపక సిబ్బంది రావడం మరి కొంచం ఆలస్యమై ఉంటే.. జింఖానా మైదానంలోని బాణసంచ షాపులన్నీ దగ్ధమై ఉండేవి. అక్కడకు దగ్గరే ఉన్న పెట్రోలు బంకుకు కూడా మంటలు వ్యాపించేవని స్థానికులు చెప్పారు.