కొవ్వు ఎక్కువ తింటే పిచ్చి ఖాయం

 

కొవ్వు పదార్ధాలున్న ఆహారాన్ని అధికంగా తీసుకోవడం ద్వారా శరీరం బరువు పెరిగిపోవడం, బాగా లావెక్కడం, రక్తపోటు, షుగర్, గుండెపోటు లాంటి వ్యాధులు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ చాలామంది కొవ్వు బాగా వున్న పదార్ధాలను చాలా ఇష్టంగా తింటూ వుంటారు. అలాంటివాళ్ళకు మరో హెచ్చరిక... కొవ్వు అధికంగా ఉన్న పదార్ధాలను ఎక్కువగా తినడం వల్ల పైన పేర్కొన్న సమస్యలు మాత్రమే కాదు... పిచ్చి కూడా ఎక్కే ప్రమాదం వుందట.

ఈ విషయం లుసియానా విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది. లుసియానా యూనివర్సిటీ పరిశోధకులు బయోలాజికల్ సైకియారిటి అనే జర్నల్లో తమ పరిశోధన ఫలితాలను వెల్లడించారు. కొవ్వు పదార్థాలను పరిమితికి మించి తినేవారి ప్రవర్తనలో విపరీత ధోరణులు ఏర్పడతాయని, అయినప్పటికీ తమ ఆహారాన్ని మార్చుకోని పక్షంలో మానసిక సమస్యలు వేగం పుంజుకుని, ఒత్తిడి బాగా పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా మానసిక సంబంధమైన సమస్యలు పెరిగిపోయి చివరికి పిచ్చికి దారితీసే ప్రమాదం వుందని సదరు పరిశోధకులు అంటున్నారు.