వ్యాన్‌పిక్ భూములపై ఉద్యమిస్తున్న రైతాగం
posted on Jul 2, 2012 @ 10:32AM
వ్యాన్‌పిక్ భూముల కుంభకోణం నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కుదిపేస్తోంది. రైతులకు అతితక్కువ డబ్బులు ఇచ్చి వారి భూములను లాక్కున్న ఈ కుంభకోణంపై ఆందోళన వ్యక్తం చేసేవారి సంఖ్యనానాటికీ పెరుగుతోంది. అంతే కాకుండా తమ భూములు తిరిగి ఇచ్చేయాలని రైతులు ఇప్పుడు వేదికలెనెక్కి మరీ కోరుతున్నాడు. అసలు తనకు జరిగిన అన్యాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వచ్చి సమస్య పరిష్కరించాల్సి ఉండగా రాజకీయఅనిశ్చితి కారణంగా ఆయన మౌనం వహించాడని రైతులు భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి కారణంగానే తమ సమస్య పరిష్కారం గురించి ముందు ప్రయత్నించిన సిఎం ఆ తరువాత ఇతర సమస్యలపై దృష్టి సారించారని రైతులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ వ్యాన్‌పిక్ కారణంగా భూములు కోల్పోయినవారందరూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరులో1600 ఎకరాల చుట్టూ ఉన్న కంచెను తొలిగించారు. ఆ తరువాత రైతులందరూ కలిసికట్టుగా బయలుదేరి వచ్చి వ్యాన్‌పిక్ వల్ల బాగుపడిన బడానేతలు ఇప్పుడు తిరిగి ఎన్నికైనా భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోకతప్పదని రైతులు హెచ్చరించారు. ఒంగోలుశాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రముఖుల గురించి ఈ సందర్భంగా రైతులు గుర్తు చేసుకున్నారు. మంత్రి మోపిదేవితో పాటు శ్రీనివాసరెడ్డిని కూడా విచారించాలని సిబిఐకి రైతులు విజ్ఞప్తి చేశారు.