రాష్ట్ర కాంగ్రెస్‌లో చిరంజీవికి పెరుగుతున్న ప్రాదాన్యత
posted on Jul 2, 2012 @ 10:54AM
సినీపరిశ్రమలో మెగాస్టార్‌గా అభిమానుల్ని అలరించిన చిరంజీవి తమిళనాడులోని హీరోకమ్ సిఎం అయిన ఎంజిఆర్‌ని, తెలుగుదేశం పార్టీని స్ధాపించిన ఎన్టీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని ప్రజారాజ్యంపార్టీని పెట్టి రాజయాలలోకి వచ్చారు. ఎక్కడ రాజకీయ సభలు పెట్టినా విరగబడివచ్చే జనం ఓట్లకు మాత్రం అంత ఇంట్రస్టు చూపలేదు. 2009 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి రాజటశేఖర్‌రెడ్డి ప్రజాసంక్షేమ పధకాల హవాలో చాలాచోట్ల కొద్ది మెజారిటీతో ఓడిపోయారు. తదనంతరం వైయస్సార్ మరణంతో జగన్‌వర్గం కాంగ్రెస ్‌నుండి విడివడిరది. ఆపరిణామంలో కాంగ్రెస్‌కు అసెంబ్లీలో బలం తగ్గకుండావుంటానికి ప్రజారాజ్యంపార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేయటం తెలిసిందే. అయితే మహాసముద్రమైన ఆపార్టీలో అంతగా ప్రాముఖ్యంలేని వారుగానే బాధపడినప్పటికీ ఇప్పుడిప్పుడే అక్కడకూడా తనహవా పెరుగుతుండటం చిరంజీవి భవిష్యత్‌లో నాయకుడిగా ఎదిగే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చిరంజీవికి మద్దతు నిచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు. ఉప ఎన్నికల ప్రచారానికి రామచంద్రాపురానికివెళ్లక పోయినా కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో గెలిచిన తోట త్రిమూర్తులు నా విజయానికి కారణం చిరంజీవేనన్నారు. నర్సాపురంనుండి కాంగ్రెస్ బరిలో ఎన్నికైన కొత్తపల్లి సుబ్బారాయుడుది అదే పాట. ఆతరువాత పెడన ఎమ్మేల్యేబోగి రమేష్ ఇంకొంచెం ముందుకెళ్లి కాబోయే ముఖ్యమంత్రి చిరంజీవే అన్నారు. అమాత్యులు రఘువీరారెడ్డి మాట్లాడుతూ చిరంజీవి నాయకత్వంలో పనిచేయటానికి నాకేమీ అభ్యతంరంలేదు అన్నారు. ఎప్పుడూ ఏదోఒక వివాదాల్లో ఉండే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ త్వరలో చిరంజీవికి కేంద్ర పదవి ఖాయం అని చెబుతున్నారు. కాలం ఏమిచెబుతుందో వేచి చూద్దాం.