బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్..
posted on Mar 19, 2021 @ 2:32PM
ఒక రైతు బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్ తయారు చేశాడు. దానికోసం ఏకంగా 5 లక్షల వరకు ఖర్చుచేశాడు. బులెట్ ఫ్రూఫ్ కారు చూశాం, బులెట్ ఫ్రూఫ్ బైక్ చూశాం , బులెట్ ఫ్రూఫ్ ఇల్లు చూశాం. బులెట్ ఫ్రూఫ్ బస్సు చూశాం. బులెట్ ఫ్రూఫ్ ట్రాక్టర్ ఏంటని అనుకుంటున్నారా. మీరు విన్నది నిజమే. పొరుగు రాష్ట్రం రైతుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు తన ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాడు. హరియాణాలోని సోనీపత్ జిల్లా ఖరమపుర్ గ్రామానికి చెందిన రాజేంద్ర ఇందుకోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సీసీటీవీ కెమెరాలతో పాటు లోపల ఏసీ, జీపీఎస్ ఏర్పాటు చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా మధ్య ఎప్పటినుంచో జలవివాదం కొనసాగుతోంది.
సరిహద్దు ప్రాంతం కావడంతో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భాలున్నాయి. ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికే ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించాను. గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డాము అని వివరించారు రాజేంద్ర.