జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడి! 43 వేల కోట్ల రూపాయల డీల్!
posted on Apr 22, 2020 @ 1:18PM
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అయిన ఫేస్ బుక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫామ్‌ల మధ్య పెద్ద ఒప్పందం కుదిరింది. జియో ప్లాట్‌ఫామ్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్‌బుక్ రూ. 43,574 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఒప్పందం కుదిరిన తరువాత ఫేస్ బుక్... జియోలో అతిపెద్ద వాటాదారుగా మారింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్‌ఫామ్‌ల సంస్థ విలువ 4.62 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశంలో సాంకేతిక రంగంలో ఎఫ్‌డిఐ కింద ఇది అతిపెద్ద పెట్టుబడిగా నమోదయ్యింది.
కలిసి పని చేయాలనే జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్ పెట్టుబడి కోసం బైండింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది.
ఈ డీల్ పైన ముఖేష్ అంబానీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాణ్యత పెంచేలా, భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సమాజంగా నిలిపేలా జియోను తీసుకు వచ్చామని, ఇప్పుడు ఫేస్‌బుక్‌ను ఆహ్వానించామని చెప్పారు.
వ్యాపారం కోసం ఫేస్‌బుక్, జియో జత కట్టాయని, డిజిటల్ ఎకానమీకి తమ బంధం దోహదం చేస్తుందని మార్క్ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.