మందు తాగాడు.. పిచ్చిగా మాట్లాడాడు.. పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు..
posted on Jul 15, 2016 @ 12:33PM
గత రెండు రోజుల క్రితం ఆప్ నేత తాగి అసెంబ్లీకి వచ్చారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో నేత మద్యం మత్తులో తానేం మాట్లాడుతున్నాడో కూడా తెలియక.. ఆఖరికి పార్టీ నుండి సస్పెండ్ కు గురయ్యాడు. ఇంతకీ ఆ ఘనకార్యం చేసిన నేత ఎవరంటే.. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన నేత లల్లన్ రామ్. అలా చుక్క నోట్లో పడే సరికి తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియక.. దమ్మున్నోడిదే రాజ్యం అంటూ.. కండలున్నోళ్ళ మద్దతున్నోడి జేబులోనే అధికారులు, ప్రభుత్వం ఉంటాయన్నాడు. తనకు చాలా మంది క్రిమినల్స్ మద్దతు ఇస్తున్నారని రెచ్చిపోయాడు. అయితే తన మాటలు రికార్డువుతున్నాయన్న సంగతి పాపం లల్లన్ రామ్ తెలుసుకోలేక పోయినట్టున్నాడు.. ఇంకేముంది సదరు రికార్డులను.. లల్లన్ రామ్ మాటలను జేడీయూ పరిశీలించింది. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉందని, నిబంధనలను ఉల్లంఘించి బీరు తాగారని చెప్తూ లల్లన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.