ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం ఫైల్స్ మాయం.. ట్రాంప్ ఫొటో సహా
posted on Dec 21, 2025 @ 4:27PM
ఎప్‌స్టీన్ తాజాగా విడుదల చేసింది, అందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకెల్ జాక్స్ వంటి ప్రముఖుల ఫోటోలున్నాయి. అవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే కొన్ని ఫైళ్లు మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నెంబరు ఫైళ్లలో ట్రంప్‌తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ ఫొటోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఫొటోలలో కేవలం నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోవమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు.
గతంలోనే వీరికి ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎప్ స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు బ్లర్ చేశారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతులను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి. వాటితో పాటు ఎప్‌స్టీన్ కథనం ప్రకారం బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మోమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం.
అయితే వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనుకోకుండా జరిగిందా? అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు. అదృశ్యమైన ఫైళ్ల విషయం బహిర్గతం అవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. హౌస్ ఓవర్ నైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. అలార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ‘ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు , మాకు పారదర్శకత అవసరం’ అని ఎక్స్‌లో ఓ పోస్టులో రాసుకొచ్చారు.