ఇంగ్లండ్, ఆసీస్ మ్యాచ్ వర్షార్పణం
posted on Oct 28, 2022 @ 4:42PM
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా గ్రూప్ 1లో జరగాల్సిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ముందు పెద్దగా అడ్డంకి కాదనే అనుకున్నారు. కానీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ బాగా ముద్దగా మారడంతో మ్యాచ్ రద్దుచేయకా తప్పలేదు. మధ్యాన్నం టాస్ కి కూడా జాప్యం అయింది. అప్పటికి వర్షం కొంత తెరిపిచ్చింది. కొంతసమయం తర్వాత ఆట ప్రారంభించవచ్చని అనుకున్నారు. కానీ అందుకు అవకాశం లేకుండా పోయింది. మ్యాచ్ ఈవిధంగా రద్దు కావడంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్ 1లో ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో స్థానంలో, ఆసీస్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
ఇరుజట్లూ చెరో మ్యాచ్ ఓడిపోయాయి గనుక మరో మ్యాచ్ కల్పోయేందుకు అవకాశం ఉండదు. ఈ పర్యాయం సెమీస్ చేరాలంటే రెండు జట్లు మరో మ్యాచ్ తప్పకుండా గెలవవవలసి ఉంటుంది. ఇంతవరకూ జరిగిన మ్యాచ్ లను పరిశీ లిస్తే మెల్బోర్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలానే ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ప్రారంభ మ్యాచ్ లోనే కివీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ లంక మీద గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆసీస్ జట్టులో టాప్ ఆర్డర్ చెప్పుకోదగ్గ సామర్ధ్యం ప్రదర్శించ లేకపోతోంది. అదే జట్టు కెప్టెన్ని, యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఇంకా చెప్పుకోదగ్గ ఫామ్ ప్రదర్శించలేకపోతున్నాడు.
ఫించ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్ వెల్ తమ పాత ఫామ్ ను ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఆసీస్ మంచి స్కోర్ సాధించలేక వెనుకంజలో పడుతోంది. బౌలింగ్ పరంగా చూసినా పాట్ కమిన్స్ తప్ప జోష్ హాజెల్ ఉడ్, మిచెల్ స్టార్క్ అటాకింగ్ బాగా చేస్తున్నారనాలి. ప్రపంచకప్ కి రావడానికి ముందు రెండు జట్లూ పోటీపడినపుడు ఇంగ్లండ్ బ్యాటర్లు మంచి ఫామ్ ప్రదర్శించి మున్ముందు జట్టు విజయాలకు వెన్నుదన్నుగా ఉంటారని ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయి బతికిపోయామనే అనుకుంటున్నారు ఇరజట్ల అభిమానులు. వారి హీరోలు అంతగా స్కోర్ చేయలేకపోతుండడమే అందుకు కారణం. ఇక ముందు జరిగే మ్యాచ్ లన్నీ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశమే ఉంది.