ఇంజనీరింగ్‌కి తగ్గిన మోజు
posted on Aug 29, 2012 @ 11:33AM
మీడియా వారు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రక్క రాష్ట్రాలకు వెళ్లి పోతున్నారని ఎంతమొత్తుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలలేదు. మొదటిరోజే దాదాపు సగం మంది విద్యార్దులు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు రాకపోవడం చూస్తే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ ప్రభుత్వం కాలేజీ ఫీజలుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాలేదు. కాలేజీల ఎంపికకు 31నుండి వెబ్ ఆప్షన్లు. అప్పటికైనా కాలేజీఫీజుల వ్యవహారం ఒక కొలిక్కి తీసుకురాగలిగితే ఇంజనీరింగ్ విద్యార్ధులు ఆఫ్షన్లు ఎంచుకుంటానికి వీలుగా ఉంటుంది. రాష్ట్రం మొత్తంమీద 53 హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 67 ఇంజనీరింగ్ కాలేజీలూ, 5 ఫార్మసీ కాలేజీల్లోనూ పెరిగే ఫీజులు ప్రభుత్వమే చెల్లించాలని విద్యార్ధిసంఘాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వవిధానాలపై విద్యార్ధులూ, వారి తల్లిదండ్రులూ నిప్పులు చెరుగుతున్నారు .
ప్రభుత్వం ఎప్పుడో 5 నెలల క్రిందట నిర్ణయించాల్సిన ఫీజులను ఇప్పటికీ నిర్ణయించకుండా జాగుచెయ్యటం విద్యార్ధిలోకాన్ని అసహనానికి గురిచేసింది. కాలేజీ యాజమాన్యాలు నష్టపోతున్నాయంటూ నూతనంగా చేరే విద్యార్ధులపై నాలుగేళ్ల ఖర్చును లెక్కపెట్టి వేయడమేమిటో అని విద్యార్ది సంఘాలు, పేదవిద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్ధులకు అనుగుణంగా కొంచెం కూడా అలోచించి న్యాయస్ధానంలో వాదించలేదని వాపోతున్నారు. యాజమాన్యాల ఇన్‌ఫ్రాస్రక్టర్ పైనాకూడా ఆదాయం కలిగేలా కాలేజీయాజమాన్యాలకు అణుగుణంగా ప్రభుత్వం స్పందించింది. దీంతో విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నాన్చుడు ధోరణి విద్యార్ధులకు శాపంగా పరిణమించింది. ఇప్పటికైనా విద్యార్ధుల సమస్యలపట్ల ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని, అందుకుగానూ అధికారులతో చర్చించి మేధావుల సలహాను పాటించి న్యాయనిపుణులను సంప్రదించాలని విద్యార్ధిసంఘాలు కోరుతున్నాయి.