బాలయ్య ఎక్కడినుండి పోటీచేస్తాడు?
posted on Aug 29, 2012 @ 11:38AM
నందమూరి బాలకృష్ట రానున్న ఎన్నికల్లో ఎక్కడనుండి పోటీ చేస్తే బావుంటుందా అని పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, బాలయ్య తండ్రి అయిన ఎన్టీరామారావు మూడు చోట్లనుండి పోటీ చేసినట్లుగా బాలయ్య కూడా చేస్తారా అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గుడివాడ, తిరుపతి, హిందూపూర్ వీటినుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సీనియర్లు. ఇంతకు ముందు పార్టీ చురుకుగా ఉన్నందున మా దగ్గరనుండి అంటే మాదగ్గర నుండి పోటీ చెయ్యండని తెలుగుతమ్ముళంతా అడిగేవారు. అయితే ఇప్పడు పరిస్థితి చాలా వ్యతిరేకంగా ఉంది. కొన్ని చోట్ల పోటీ చేయడానికి సరైన నాయకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీముఖ్యంగా కృష్టాజిల్లాలో గుడివాడనుండి పోటీ చేయించడానికి కొడాలినానీకి ముందు పార్టీలో ఉన్న వారిని పార్టీ బ్రతిమిలాడవలసి వస్తుంది. బాలయ్య ఇకపై పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఏ పదవీ ఇవ్వలేదు. కేవలం బాబు బిసి మంత్రంతోనే 2014 ఎన్నికలను గట్టెక్కుదాం అనుకుంటున్నారు. మిగతానాయకులతో పోలిస్తే తెలంగాణ కెసిఆర్, కోస్తాంద్రలో బాబు ప్రకటనలకు స్పందన తక్కువ. వీరి ప్రచారాన్ని అంతగా ప్రజలు పట్టించుకోరన్న అపవాదు వుంది. కెసిఆర్ ఎప్పుడూ అదిగో తెలంగాణా, ఇదిగో తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెడుతుంటారని ప్రతిపక్షాల ఆరోపణ. అలాగే బాబు ఇదివరలో వ్యవసాయం దండగ అనడం, కరెంటు చార్జీలు పెంచడం లాంటివి మరికొన్ని చేసి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. బాలయ్య యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనటానికి ఎంతవరకు సహకరిస్తారో , తద్వారా ఎక్కడినుండి పోటీ చేస్తారో వేచి చూడవలసిందే.