122 కోట్ల వైఎస్ జగన్ ఆస్తులు జప్తుకు రంగం సిద్దం
posted on Feb 20, 2013 @ 5:07PM
అక్రమాస్తుల కేసులో జైలుపాలయిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వివిధ కేసుల్లో అతని ఆస్తుల జప్తు కోరుతున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఈ రోజు న్యాయప్రాధికార సంస్థ రూ.122కోట్ల విలువయిన జగన్ ఆస్తులను జప్తునకు ఆమోదం తెలిపింది. జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన వేర్వేరు సంస్థలలో పెట్టుబడులకు నిధుల తరలింపులో చట్టాలను ఉల్లంఘించినట్లు ప్రాధమికంగా ద్రువీకరింపబడటంతో, న్యాయప్రాదికార సంస్థ జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన వివిధ సంస్థలకు చెందిన రూ.122కోట్ల విలువయిన ఆస్తులను జప్తునకు ఈడీకి అనుమతి ఇచ్చింది.
ఈ.డీ. స్వాదీనం చేసుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు:
1.జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ.14.5కోట్ల విలువయిన ఫిక్సెడ్ డిపాజిట్లు.
2.జననీ ఇన్ఫ్రా కు చెందిన 13ఎకరాల స్థలం.
3.అరబిందో సంస్థకు చెందిన 96 ఎకరాల స్థలము మరియు రూ.3కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు.
4.హెత్రో డ్రగ్స్ సంస్థకు చెందిన 35 ఎకరాల స్థలము మరియు రూ.3కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు.
5.హైదరాబాద్ లో గచ్చిబౌలీ వద్దగల బౌల్డర్ విల్లాలల 34ఇళ్ళ స్థలాలు.