నావెంటే అందరూ...కాదు నావెంటే!
posted on Oct 8, 2022 @ 12:23PM
తన వెంట గుప్పెడుమందే మిగిలినా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన వివరణలో మాత్రం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన వెంట సభ్యుల సంఖ్య సున్నాగా పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన సభ్యులను తనవైపు లాక్కుని ఏక్‌నాధ్ షిండే తన ఆధిపత్యం ప్రదర్శించిన నాలుగు మాసాల తర్వాత ఉద్ధవ్ థాక్రే తన పార్టీ సభ్యుల డేటా వివరాలు ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తూ, పార్టీ పేరు, గుర్తు అన్నీ తాము పొందేందుకు అర్హత ఉందని పేర్కొ న్నారు.
టెక్నికల్‌గా ఇప్పటికీ శివసేన పార్టీ అధినేతగా ఆ పార్టీని యాభయ్యేళ్ల క్రితం స్థాపించిన బాల్ థాక్రే పేరు ఉంది. అయితే ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామంది తనతో లేరని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న శివసేన అధినేతగా ప్రచారం చేసుకుంటున్న ఏక్‌నాథ్ షిండే వెంట కూడా ఎవ్వరూ లేరని ఉద్ధవ్ పేర్కొన్నారు. పార్టీ రెబెల్ నాయకులను షిండే తో ఉన్నట్టుగా చూపించరు. కారణం వారు పార్టీ మారడం పై అనర్హత వేటు కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే షిండే వెనుక చాలా తక్కువమందే ఉన్నట్టు అర్ధమవుతుంది. అయితే టెక్నికల్‌గా పార్టీ ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే నే కనుక ఎన్నికల కమిషన్ వారి పార్టీ సభ్యుల వివరాల సంబంధించి ఆయన స్పందించాలన్నది. షిండే తోపాటు కొందరు పార్టీ నుంచి స్వయంగా విడిపోయారు గనుక పార్టీ సింబల్‌ను నవంబర్ 3 న జరిగే ఉప ఎన్నికల్లో ఉపయోగించడానికి వీలులేదని ఉద్ధవ్ డిమాండ్ చేస్తున్నారు.
సభ్యుల వివరాల విషయానికి వస్తే, మొత్తం 54 మంది సేనా ఎమ్మెల్యేల్లో 14 మంది, అలాగే మండలిలోని 12 మంది సభ్యులు, అలాగే రాజ్యసభ లోని ముగ్గురు ఎంపీలు, 19 మంది ఎంపీల్లో ఏడుగురు తనకు మద్ద తుగా ఉన్నారని థాక్రే పేర్కొ న్నారు. అయితే షిండే వేపు వెళ్లినవారిపై అనర్హత వేటు పై కేసులు పెం డింగ్ లో ఉన్నాయని ఎన్నికల కమిషన్ కి థాక్రే వివరించారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో షిండే 164 మంది మద్దతుతో అధికారంలోకి రావడానికి అర్హత సంపాదించారు. షిండేతో జతకట్టిన బీజేపీ తరఫున 106 మంది ఉన్నారు. పార్టీ ఆఫీసు సంబంధించిన వారిలో చాలమంది షిండే పంచనే చేరారు. కానీ పార్టీ 2018 జనవరిలో ఏర్పడినట్టుగా షిండే పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ లో ప్రకటించారు. మొత్తం 234 మంది సభ్యుల్లో 160మంది మద్దతు లభించింది. కానీ అది షిండే వెంట ఎవ్వరూ లేరన్నదే ఈసీ కి అందించిన జాబితాలో తెలియజేసింది. అయితే టీమ్ థాక్రే మాత్రం సుమారు పది లక్షలమంది మద్దతు ఉందని ప్రకటించుకుంది. మరో వంక రెబెల్ వైపు కేవలం 1.6 లక్షలమందే ఉన్నట్టు వివరణ ఇచ్చింది. ఇప్పటికే పోల్ ప్యానల్ కోసం అయిదు లక్షల మంది పార్టీలో చేర్చే లక్ష్యంతో అందుకు సంబంధించిన అఫిడెవిట్లు సేకరణ పనిలో ఉంది. అంతేగాక పార్టీ సంస్థాగత పదవులు కలిగిన వారిలో రెండు లక్షల 62 వేలమందికి పైగా తమ పక్షాన ఉన్నట్టుగా టీమ్ థాక్రే పేర్కొన్నది. చిత్రంగా ఇందులోనూ పురుషులు, స్త్రీలు సభ్యుల సంఖ్య సరి సమానంగా ఉన్నార న్నది.
బిజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన షిండే వర్గం తమను అనర్హులుగా ప్రకటించడానికి వీలులేదనే వాదిస్తున్నారు. బాల్‌థాక్రే స్థాపించిన పార్టీ హిందుత్వ వాదాన్నించి ఆయన కుమారుడు ఉద్దవ్ థాక్రే తప్పుకున్నారని, బీజేపీతో విడిపోయి 2018లో కాంగ్రెస్, ఎన్‌సిపీలతో కలవడమే అందుకు నిదర్శనమని షిండే వర్గం వాదిస్తోంది. ఇక ఇపుడు ఎన్నికల కమిషన్ థాక్రే నాయకత్వంలోని శివసేన తన పార్టీ గుర్తుగా బాణం విల్లంబు ను అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నికకు ఉపయోగించడానికి అనుమతిస్తుందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉంది. జూన్‌లో శివసేనలో చీలక తర్వాత జరుగనున్న పెద్ద ఎన్నిక ఇదే.