నేపాల్ లో 6.3 తీవ్రతతో భూ కంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
posted on Nov 9, 2022 4:31AM
నేపాల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూ కంప తీవ్రత 6.3గా నమోదైంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన భూ కంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం ప్రకటించింది. 5 గంటల వ్యవధిలో నేపాల్ లో రెండు సార్లు భూమి కంపించింది.
తొలుత మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూమి కంపించిందని సిస్మోలజీ సెంటర్ పేర్కొంది. కాగా నేపాల్ లో సంభవించిన ఈ భూకంపం కారణంగా భారత్ లోని ఢిల్లీ, నొయిడా పరిసర ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు. నేపాల్ 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. ఈ భూకంపం కారణంగా దాదాపు 8 లక్షల భవనాలు ధ్వంసమయ్యాయి. 9,000 మంది మరణించారు. 22,000 మందికి పైగా గాయపడ్డారు గాయపడ్డారు. భూకంపం వల్ల 800,000 ఇళ్లు, పాఠశాల భవనాలు కూడా అప్పట్లో కూడా ఈ భూకంప ప్రకంపనలు ఢిల్లీ సహా పలు నగరాలను వణికించాయి.