గజ గజ వణుకుతున్న హైదరాబాద్
posted on Dec 19, 2023 @ 11:10AM
హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. చలితో నగరవాసులు గజ.. గజ వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటోంది.రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతున్నాయి. పగటి పూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్ కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. సోమవారం అత్యల్పంగా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.
రాంచంద్రాపురం 14.8, రాజేంద్రనగర్ 14.9 ,సికింద్రాబాద్ 15.4 , కుత్బుల్లాపూర్ 15.7, హయత్‌నగర్15.8, మల్కాజిగిరి 16.3, గాజులరామారం 16.3, కూకట్‌పల్లి 16.7,బేగంపేట 16.9