రాజమండ్రి జైలులో కరోనా కలకలం.. హాస్పిటల్ లో దూళిపాళ్ల నరేంద్ర
posted on May 4, 2021 @ 1:08PM
సంగం డెైయిరీ కేసులో నిందితులుగా రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ళ నరేంద్ర అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఆయనను రాజమంఢ్రి సెంట్రల్ జైలు నుంచి కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సంగం డెయిరీ అక్రమాలపై నమోదైన కేసులో రిమాండ్‌లో ఉన్న సహకార శాఖ మాజీ అధికారి గురునాధంను కూడా కోవిడ్ పరీక్షలు కోసం ఆసుపత్రికి తరలించారు.
దూళిపాళ్లతో పాటు అరెస్టైయిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ కు కరోనా నిర్ధారణ అయింది, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గోపాలకృష్ణన్ కు సోమవారం మధ్యాహ్నం కరోనా లక్షణాలు కనపడ్డాయని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తడంతో జైలు అధికారులు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది.సంగం డెయిరీ ఎండీకి కరోనా సోకడంతో సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.