ఎన్నికలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు... అది ఖాయం...
posted on Oct 18, 2016 @ 12:28PM
వివాదాస్పద వాఖ్యలు చేయడంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ దిట్ట అని మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన ఎన్నికలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నసంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన బల్ల గుద్ది చెబుతున్నారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడనున్నాయని.. రిగ్గింగ్ వ్యవహారంలో వైట్ హౌస్ కు కూడా ప్రమేయం ఉందని.. ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. అంతేకాదు మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బయటకు వచ్చిన వీడియోలపై స్పందిస్తూ.. ఎన్నికల ముందు వీడియోలు బయటపెట్టి తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు. మరి మన దేశంలో రిగ్గింగ్ లు జరిగే అవకాశం ఉంది. అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా రిగ్గింగులు జరుగుతాయంటే ఆశ్చర్యపడాల్సిన విషయమే. మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం..